Home » Ponguleti Srinivasa Reddy
ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే వాటన్నింటినీ ఆపేస్తామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..
రాష్ట్ర ఆదాయం పెంపునకు మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా శాఖలు, ఆరోగ్యశ్రీ విభాగంపై శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
LRSపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. LRS దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఖమ్మం జిల్లా: పేదవారి ప్రభుత్వం వచ్చిన తరువాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని, అనేక కష్టాలు, నష్టాలు పడి తనను మంచి మెజారిటీతో గెలిపించారని, మీరిచ్చిన అవకాశంతోనే తాను ఈస్థాయిలో ఉన్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.
ఉద్యమ సమయంలో సాగరహారం.. మిలియన్ మార్చ్, వంటావార్పులకు వేదికైన ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం తెలంగాణ దశాబ్ది సంబురాలు అంబరాన్నంటాయి. వరణుడు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడా? అన్నట్లుగా గంటపాటు వాన దంచికొట్టినా.. కళాకారుల నృత్యాలు, పోలీసుల ఫ్లాగ్‌మార్చ్ ఆగలేదు.
‘‘ఈ ఏడాది జూన్ 2కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.
పాలేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇళ్ళు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు ఆయన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం మీ సమస్యలన్నీ తీరుస్తానన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వేపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూ సర్వే పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు కావాలి?