Home » Ponguleti Srinivasa Reddy
మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేసి నెల రోజులు కావస్తోందని, ఈడీ దాడులపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా ఎందుకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు చేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో రాజకీయ బాంబు పేలబోతోందంటూ దక్షిణ కొరియా పర్యటనలో వ్యాఖ్యానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు.
ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses Scheme) లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas) శనివారం తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత సర్కారులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే బాంబులు పేలతాయని ..
తెలంగాణ మంత్రుల దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. మూసీలాగే ఒకప్పుడు సియోల్ హాన్ రివర్ కూడా మురికి కుపంగా ఉండేదని అన్నారు. హాన్ రివర్ను ఎలా అభివృద్ది చేసి స్వచ్చంగా మార్చారో తెలుకున్నామని చెప్పారు.నది వెంట ఉన్న పేద వారికి పునరావాసంతో పాటు ఏం పరిహారం ఇచ్చారో చర్చించినట్లు తెలిపారు.
బావ, బావ మరుదులిద్దరు (కేటీఆర్, హరీష్ రావు) పబ్లిసిటీతో పబ్బం గడుపుతున్నారని.. పబ్బం గడుపుకోవడానికి మూసి పేరిట రాజకీయం చేస్తున్నారని, తప్పు చేస్తే ఉపేక్షించమని, తప్పు చేయకుండా అరెస్ట్ చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ వచ్చాక ధరణిని బంగాళా ఖాతంలో వేస్తాం అని చెప్పామని... చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విదేశీ కంపెనీ కబంధహస్తాల నుంచి కేంద్రంలోని ఎన్ఐసికి అప్పగిస్తున్నామన్నారు. 2024 కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకు వస్తున్నామని, 15 దేశాల్లోని మంచి రెవెన్యూ అంశాలను తీసుకుని డ్రాఫ్ట్ తయారు చేశామని చెప్పారు.
దీపావళికి ముందే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ బాంబు పేల్చారు. దక్షిణకొరియా రాజధాని సియోల్లో హాన్ నది పునరుజ్జీవనంపై అధ్యయనానికి వెళ్లిన పొంగులేటి అక్కడ ఓ తెలుగు చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నగరంగా నిర్మించనున్న ఫోర్త్సిటీకి స్మార్ట్ సొబగులు అద్దాలని యోచిస్తోంది. కాలుష్యరహిత విధానాలు అనుసరిస్తూ.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసే యోచనలో ఉంది.
ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మ్యానిఫెస్టో హామీని అమల్లోకి తీసుకొచ్చింది.