Ponguleti Srinivas: ఎస్పీ ఎక్కడ.. కలెక్టర్, పోలీసులపై పొంగులేటి ఫైర్
ABN , Publish Date - Jan 24 , 2025 | 01:28 PM
Ponguleti Srinivas: పోలీసులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. కలెక్టర్‌పైన పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రం ఆగ్రహించారు. ఎస్పీ ఎక్కడ అంటూ సీరియస్ అయ్యారుర. కరీంనగర్‌లో కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు.

కరీంనగర్, జనవరి 24: కరీంనగర్ పర్యటనలో పోలీసులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై మండిపడ్డారు. కలెక్టర్‌పైన పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఆర్ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా ఆగ్రహించారు. ఎస్పీ ఎక్కడ అంటూ సీరియస్ అయ్యారు. కరీంనగర్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ (Union Minister Manohar Lal Kattar) పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా.. కరీంనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ జిల్లాకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోరన్టుకు చేరుకున్న కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కరీంనగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కరీంనగర్‌లో 24 గంటల తాగునీరు, మల్టీ పర్పస్ పార్క్‌ను కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. అనంతరం బైపాస్ రోడ్‌లో డంప్ యార్డ్‌ను సందర్శించనున్న కేంద్రమంత్రి కట్టర్.. అక్కడి నుంచి హౌజింగ్ బోర్డు కాలనీలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి..
వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు..ఇందులో నిజమెంత..
Dil Raju IT Raids: దిల్‌రాజు ఇంట్లో ముగిసిన సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి
Read Latest Telangana News And Telugu News