Home » Student
నాగార్జున సాగర్‌కు చెందిన చెరుకుపల్లి విజయ్ కుమార్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినికి పరిచయం అయ్యాడు. మెుదట స్నేహితుడిగా ఉంటానని చెప్పి తర్వాత ప్రేమ పేరుతో వేధించడం మెుదలుపెట్టాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఫిలిప్పైన్స్‌లో రాష్ట్ర వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్ధ. శుక్రవారం ఆమె పుట్టినరోజు.
పదో తరగతి వార్షిక పరీక్షలను రాయబోయే విద్యార్థులకు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి రెండు రోజుల సమయమే ఉంది.
బైక్ అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ఓ డిప్లొమా విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. అప్పుడే ఇంట్లో బైబై చెప్పి కాలేజీకి వెళ్తున్న కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిందన్న వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పాఠశాల విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తరగతి గదిలో బోర్డుపై ఉపాధ్యాయులు రాసే అక్షరాలు కనిపించడం వారికి కష్టతరంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖ ఆఽధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో 1,365 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షల హాల్‌టికెట్లు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చా యి.
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ (అపార్) పేరుతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలో మొదలైన ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఎందుకంటే విద్యాసంస్థల్లోని చాలామంది విద్యార్థుల రికార్డులకు.. వారి ఆధార్‌లోని వివరాలు సరిపోలడం లేదు. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు మొదలయ్యాయి.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. గద్దెనెక్కిన తొలిరోజే భారతీయులకు షాక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే భారతీయ విద్యార్థులకు ట్రూడో ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
పదో తరగతి వార్షిక పరీక్ష రుసుం తేదీలను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎలాంటి ఆలస్యం రాకుండా ఈ నెల 18వ తేదీ వరకు విద్యార్థులు రుసుం చెల్లించడానికి గడువును నిర్ణయించారు.