10th Exams : పది పరీక్షలు పకడ్బందీగా సాగాలి
ABN , Publish Date - Mar 04 , 2025 | 12:30 AM
జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ ప్రసాద్‌బాబు.. అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్‌ఎ్‌సబీఎన కళాశాలలోని సమావేశ మందిరంలో సోమవారం 2025 టెన్త పరీక్షల సీఎ్‌సలు, డీఓలకు ఏసీ గోవింద్‌నాయక్, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులుతో కలిసి ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. సీఎస్, డీఓలు ముందుగానే కేంద్రాలను సందర్శించి, అక్కడ అన్ని వసతులు ఉన్నాయో.. ...

డీఈఓ ప్రసాద్‌బాబు
అనంతపురం విద్య, మార్చి 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ ప్రసాద్‌బాబు.. అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్‌ఎ్‌సబీఎన కళాశాలలోని సమావేశ మందిరంలో సోమవారం 2025 టెన్త పరీక్షల సీఎ్‌సలు, డీఓలకు ఏసీ గోవింద్‌నాయక్, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులుతో కలిసి ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. సీఎస్, డీఓలు ముందుగానే కేంద్రాలను సందర్శించి,
అక్కడ అన్ని వసతులు ఉన్నాయో.. లేవో.. చూసుకోవాలన్నారు. బెంచీలు, లైటింగ్, వాష్‌రూమ్స్, తాగునీరు ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లతో సమావేశమై పరీక్షలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఏసీ గోవింద్ నాయక్ మాట్లాడుతూ... త్వరలో జిల్లాకేంద్రానికి పదో తరగతి ప్రశ్నాపత్రాలు వస్తాయన్నారు. సీఎ్‌సలు, డీఓలు ముందుగానే తమకు కేటాయించిన కేంద్రాలకు సమీపంలోని పోలీస్టేషన్లను చూసి, ప్రశ్నాపత్రాలు పెట్టే బాక్సులు ఉన్నాయో.. లేవో చూసుకోవాలన్నారు. పొరబాట్లకు తావివ్వద్దని ఆయన సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....