Home » Telugu Desam Party
Minister Kondapalli Srinivas: టీడీపీ నాయకత్వాన్ని బలహీనపరచాలని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో మంచి వాతావరణం ఉందన్నారు. వైసీపీ బలహీనపడటంతో ఆ పార్టీ నేతలు కొత్త రకం డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
Minister Sandhya Rani: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు.విజయసాయిరెడ్డి అండ్ కో వేలాది కోట్లు దోచిన ఘనులని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంప వదిలి రాని జగన్ ఇప్పుడు తగుదనమ్మ అంటూ బయలుదేరారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆక్షేపించారు.
కడప మేయర్ సురేష్ బాబుపై తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ధ్వజమెత్తారు.
ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని మాటిచ్చారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే ప్రజలు, కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి కుటుంబ నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు.
జగన్‌ను అసహ్యించుకుని కూటమిలో వైసీపీ నేతలు చేరుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. పార్టీలో ఉన్న సీనియర్లకు పెద్ద పీట వేస్తామని మాటిచ్చారు. అందరిని సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని చెప్పారు.
మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలకనేత ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి.. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆళ్ల నాని కూడా టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు.
పలాసలో టీడీపీ నేత హత్య కోసం బీహార్ గ్యాంగ్‌కు సుపారీ ఇవ్వడం కలకలం రేపుతోంది. వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేశారు. అమాయకుల భూములపై లిటిగేషన్లు పెట్టి మధ్యవర్తిత్వం వహించి భారీగా డబ్బులు గుంజారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి.. అప్పనంగా అమ్మేశారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని ఆంధ్రప్రదేశ్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
రాష్ట్ర దశ, దిశను మార్చే స్వర్ణాంధ్ర - 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆరోగ్యం.. సంపద..