AP NEWS: జమిలీ ఎన్నికలపై వైసీపీవీ కలలే.. శ్రీనివాసరెడ్డి విసుర్లు
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:57 PM
జగన్‌ను అసహ్యించుకుని కూటమిలో వైసీపీ నేతలు చేరుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. పార్టీలో ఉన్న సీనియర్లకు పెద్ద పీట వేస్తామని మాటిచ్చారు. అందరిని సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని చెప్పారు.
కడప: ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు పని చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం, చంద్రబాబు పరిపాలన దక్షిత చూసి తెలుగుదేశం పార్టీలో పలువురు వైసీపీ నేతలు చేరుతున్నారని తెలిపారు. అభివృద్ధికోసం ఎవరువచ్చినా టీడీపీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. చంద్రబాబు పనితీరు, తమ కుటుంబంపై నమ్మకంతో కార్పొరేటర్లు చేరారని ఆర్ శ్రీనివాసరెడ్డి అన్నారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిను అసహ్యించుకుని కూటమిలో వైసీపీ నేతలు చేరుతున్నారని చెప్పారు. పార్టీలో ఉన్న సీనియర్లకు పెద్ద పీట వేస్తామని మాటిచ్చారు. అందరిని సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని చెప్పారు.భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే.. అందుకే వైసీపీ ఖాళీ అవుతోందని అన్నారు. జమిలీ ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి రావచ్చని వైసీపీ నేతలు కలలు కంటున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు కలలు కనండి.. తాము అభివృద్ధి చేసుకుంటూ పోతామని అన్నారు. ప్రజలు మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వానికే పట్టం కడతారని అన్నారు.నీటి సంఘం ఎన్నికలు ఎదుర్కొలేక జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోయారని ఆర్ శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
కడప నగరం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తాం: ఎమ్మెల్యే మాధవి రెడ్డి
కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపారని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు. అభివృద్ధి కోసం కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు. కడప నగరం అభివృద్ధి కోసం చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తులో కూడా చేరికలు ఉంటాయని.. కడప నగరం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Cabinet meeting: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం..
Pawan Kalyan: ‘జల్‌జీవన్’లో జనం భాగస్వామ్యం
Kakinada: డమ్మీ పిస్టల్‌తో బెదిరించి.. బంగారం దోచేసి..!
Read Latest AP News and Telugu News