Minister Kondapalli Srinivas: బొత్సను కలవడంపై మంత్రి శ్రీనివాస్ ఏమన్నారంటే...
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:22 PM
Minister Kondapalli Srinivas: టీడీపీ నాయకత్వాన్ని బలహీనపరచాలని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో మంచి వాతావరణం ఉందన్నారు. వైసీపీ బలహీనపడటంతో ఆ పార్టీ నేతలు కొత్త రకం డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
అమరావతి: తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను కాకా పట్టామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విజయనగరంలో బొత్స కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని గుర్తుచేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను బలహీనపర్చాలనే వైసీపీ ఆలోచన సఫలం కాదన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ కార్యకర్తలను బలహీనపర్చాలనే వైసీపీ ఆలోచన ఎన్నటికి సఫలంకాదని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ ఆలోచనలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని అన్నారు. ఇరిగేషన్, వ్యవసాయం, రోడ్ అండ్ బిల్డింగ్స్ విషయాల్లో చిత్తశుద్దితో పరిష్కార మార్గాలు వెతుకుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
టీడీపీ నాయకత్వాన్ని బలహీనపరచాలని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో మంచి వాతావరణం ఉందన్నారు. వైసీపీ బలహీన పడటంతో కొత్త రకం డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బొత్స సత్యనారాయణను కాకా పట్టామనడం అసత్య ప్రచారమేనని చెప్పారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 88మంది కొత్త అభ్యర్థులకు పట్టం కట్టారంటే అది టీడీపీపై ఉన్న నమ్మకమని చెప్పారు.ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పార్టీ ఆలోచనా విధానం ఇప్పటికైనా మారాలని అన్నారు. భవిష్యత్తులో విజయనగరం జిల్లాను ఆదర్శ జిల్లాగా మారుస్తామని చెప్పారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. బొత్స సత్యనారాయణ భూ దందాలు, భూ కబ్జాలు తమ దృష్టికి వచ్చాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.
అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారు: మంత్రి గొట్టిపాటి
అన్ని వ్యవస్థలను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. పదవి నుంచి దిగిపోతూ ప్రజలపై జగన్ విద్యుత్ భారం మోపారని ఆరోపించారు. రైతులకు రూ.1,850 కోట్ల మేర ధాన్యం బకాయిలు పెట్టారన్నారు. 3 రాజధానులంటూ అమరావతి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. జగన్ వల్ల అమరావతి నిర్మాణం ఖర్చు రెట్టింపైందని చెప్పారు. ప్రభుత్వ ఆదాయాన్ని జగన్ దోచుకున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం
Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం
Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..
Read Latest AP News and Telugu News