Home » TG News
బ్రేక్‌ఫాస్ట్‌గా నగరవాసులు ఉల్లిదోసెనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. దేశంలో ఉదయం పూట అత్యధికంగా దోసెను ఆర్డర్ చేసేది హైదరాబాదీలేనని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ పేర్కొంది. ‘
CM Revanth Reddy: భారత బలగాలు మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలేవా అని కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. మన దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడుతే అధునాతన ఆయుధాలతో ఊచకోత కోసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Sandhya Theatre Stampede: హైదరాబాద్‌లోని సంధ్యాథియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను(Allu Arjun) చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు. అయితే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.
Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు విజిలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే వెబ్ సైట్లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్, ఇసుకపై కేబినెట్లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
రంగులు, సల్ఫర్, ఇతర పదార్థాలు ఉపయోగించి, నకిలీ టీపొడి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో రేవంత్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
సాయినగర్ 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా వివేకానందనగర్ ఫీడర్ పరిధిలో మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు బోడుప్పల్ ఏఈ ఎన్.వేణుగోపాల్(Boduppal AE N.Venugopal) తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్(Dr. K. Lakshman) అన్నారు. సోమవారం ముషీరాబాద్‌కు చెందిన బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం(Musheerabad Constituency) జాయింట్ కన్వీనర్ ఎం.నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ను కలిసి ముషీరాబాద్(Musheerabad) అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బెంగళూరు(Bengaluru) నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలుదారుడిని సౌత్‌వె్‌స్టజోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట(Amberpet)కు చెందిన సోలోమన్ సుశాయిరాజ్(33) డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు.
మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు మృగాళ్లు మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నా.. షీటీమ్స్(Shee teams)ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోకిరీల భరతం పడుతున్నా.. అరాచకాలు, అత్యాచారాలు మాత్రం తగ్గడంలేదు.