యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి ఖిల్లా వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
శారీరక, మానసిక వికాసంలో ఆటలకు ఉన్న ప్రాధాన్యం ఎంతో గొప్పది. పూర్వీకుల నుంచి ఆటల పట్ల ఉన్న ఆ ప్రాధాన్యం మాటల్లో చెప్పలేనిది.
ధరణి ఆపరేటర్లు వేతనాల కోసం ఏడాది కాలంగా అవస్థలు పడుతున్నారు. ఇచ్చేదే తక్కువ జీతం అది కూడా 12 నెలలుగా ఇవ్వకపోవడంతో కుటుంబ అవసరాలకు అప్పుపుట్టక ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి వినవించుకున్నా ఫలితం లేకుండా పోతోందని వాపో తున్నారు. - (ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)
దేశ హితం కోసం ఆవిర్భవించిన పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పార్టీ జెండాను ఎగురవేసి సీనియర్ నాయకులను సత్కరించి మాట్లాడారు.
మండుతున్న ఎండల్లో మద్యం ప్రియులు చల్లని బీర్ల ను లాగించేస్తుంటారు. దీంతో ఫిబ్రవరి చివర నుంచి జూన్ మొదటి వారం వరకు బీర్ల విక్రయాలు భారీగా ఉంటాయి. ఈ విక్రయాల్లో బార్లు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయనే ఆరోపణ లు ఉన్నాయి. తక్కువ విక్రయాలు ఉన్న బార్ల నుంచి ఎక్కువ అమ్మకాలు సాగే బార్లకు బీర్లు తరలిస్తున్నట్టు సమాచారం.
ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పనులు మే నెలలో పునఃప్రార ంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవుట్లెట్లో పెండింగ్ ఉన్న సొరంగమార్గాన్ని టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) ద్వారానే కొనసాగించాలని తాజాగా, ఈ నెల 5న జరిగిన సమీక్షలో నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి ఆదేశంతో ఈ పనుల పునరుద్ధరణకు అవసరమైన కార్యాచరణ వేగంగా కొనసాగించాలని ఏజెన్సీకి ఎస్ఎల్బీసీ అధికారులు సూచించారు.
అసలే వేసవి..చుక్క నీటిని ఒడిసి పట్టాల్సిన సమయం. అలాంటిది కాల్వ గేట్లకు గుర్రపు డెక్క ఆకు అడ్డంకిగా మారి..నీటి ప్రవాహాన్ని మందగింప చేస్తోంది.
యాదాద్రి థర్మల్ విద్యుత పరిశ్రమలో భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఉపాధి, నివాస గృహాలు ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో హైదరాబాద్లోని ప్రజాభవనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామకపత్రాలు అందించడంతో వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
మిర్యాలగూడ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కళావేదికకు రాజకీయ గ్రహణం వీడడం లేదు. పౌరాణిక కళలను బతికించాలనే తపనతో తెలుగు సాహిత్య, సాంస్కృతిక రం గంలో అంతర్భాగమైన పౌరాణిక పద్య, గద్య నాటకాలను పరిరక్షించుకోవాలనే ఆలోచనతో తెలుగు భాషా ఔనత్యాన్ని భవిష్యత్ తరాలకు అందిం చాలని దాదాపుగా 40 ఏళ్లుగా 40 మంది కళాకారులు మిర్యాలగూడ కేంద్రంగా సాంస్కృతిక కళాక్షేత్రం నిర్వహిస్తూ కళలకు జీ వం పోస్తున్నా రు.
భువనగిరి బార్ అసోసియేషన ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిల స్థానాలకు ఇద్దరేసి అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు.