మినీ రవీంద్రభారతి ప్రారంభమెప్పుడో..?
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:30 AM
మిర్యాలగూడ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కళావేదికకు రాజకీయ గ్రహణం వీడడం లేదు. పౌరాణిక కళలను బతికించాలనే తపనతో తెలుగు సాహిత్య, సాంస్కృతిక రం గంలో అంతర్భాగమైన పౌరాణిక పద్య, గద్య నాటకాలను పరిరక్షించుకోవాలనే ఆలోచనతో తెలుగు భాషా ఔనత్యాన్ని భవిష్యత్ తరాలకు అందిం చాలని దాదాపుగా 40 ఏళ్లుగా 40 మంది కళాకారులు మిర్యాలగూడ కేంద్రంగా సాంస్కృతిక కళాక్షేత్రం నిర్వహిస్తూ కళలకు జీ వం పోస్తున్నా రు.

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)
మిర్యాలగూడ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కళావేదికకు రాజకీయ గ్రహణం వీడడం లేదు. పౌరాణిక కళలను బతికించాలనే తపనతో తెలుగు సాహిత్య, సాంస్కృతిక రం గంలో అంతర్భాగమైన పౌరాణిక పద్య, గద్య నాటకాలను పరిరక్షించుకోవాలనే ఆలోచనతో తెలుగు భాషా ఔనత్యాన్ని భవిష్యత్ తరాలకు అందిం చాలని దాదాపుగా 40 ఏళ్లుగా 40 మంది కళాకారులు మిర్యాలగూడ కేంద్రంగా సాంస్కృతిక కళాక్షేత్రం నిర్వహిస్తూ కళలకు జీ వం పోస్తున్నా రు. కళాపోషకుల అనుగ్రహంతో అనేక ఏళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తూ కళల పునరుజ్జీవనానికి కృషి చేస్తూ వస్తున్నారు. అనేక ప్రదేశాల్లో జరిగిన నాటక పోటీల్లో బహుమతులు సైతం పొందుతూ వస్తు న్నారు. అయితే తాము నాటక పోటీలకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, తాము నిర్వహించే నాటక పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కళా కారులకు ఎలాంటి వసతులు లేకపోవడం, రీహర్సల్స్, విశ్రాంతి తీసుకోవడానికి వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేప థ్యంలో మిర్యాలగూడ హౌసింగ్‌బోర్డులోని వేంకటేశ్వర ఆలయ కమిటీ సహకారంతో జాతీ య స్థాయి నాటక పోటీలను సైతం అరకొర వసతుల మధ్య నిర్వహించారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రీహారల్స్, వసతికి రైస్‌మిల్లర్స్ భవన్‌ను వినియోగించుకోవాల్సి వ చ్చింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి లాగా మిర్యాలగూడలో మినీ రవీ ంద్రభారతిని నిర్మించి కళాప్రదర్శన, కళాకారులకు విశ్రాంతిని ఏర్పాటు చేయాలని అనేక మంది ప్రజాప్రతినిధులను అభ్యర్ధించారు. నాటి మంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చొరవతో సూదిని జైపాల్‌రెడ్డి ఎంపీ కోటాలో రూ.కోటి మంజూరు చే యగా 2008-09లో ఎన్‌ఎస్పీ మైౖదానంలో మినీ రవీంద్రభారతి పనులు ప్రారంభమయ్యాయి.
రూ. 10 కోట్లతో నిర్మాణం
2008లో రూ.2 కోట్ల అంచనా మినీ రవీంద్ర భారతి భవన నిర్మాణం ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రారంభించిన భవనాన్ని నిఽధుల కొరత వెంటాడింది. కేం ద్రం రూ. కోటి విడుదల చేయగా రాష్ట్ర ప్రభు త్వం నిధులు విడుదల కాలేదు. దీంతో బేస్ మెంట్, పిల్లర్ల దశలోనే చాలా కాలం నిర్మాణం నిలిచిపోయింది. అనంతరం 2013- 14లో ఎంపీ నిధులు రూ.30 లక్షలు మంజూరు చేశారు. 2014-15లో మరో రూ.కోటి ఎంపీ కోటా నుంచి మంజూరు చేశారు. 2016లో ఎస్టీఎఫ్ నుంచి రూ.2 కోట్లు విడుదల చేశారు. పబ్లిక్ హెల్త్‌శాఖ ఆధ్వర్యంలో 4.30 కోట్లు ఖర్చయినప్పటికీ స్లాబ్ మాత్రమే పూర్తై అసంపూర్తిగా నిలిచిపోయింది. రెండో ఫేజ్‌లో భవన నిర్మాణ బాధ్యతలు మునిసిపల్ శాఖకు బదిలీ అయ్యాయి. 2021- 22, 2022-23లో రూ.కోటి చొప్పున రూ.2 కోట్లు నిఽధులు మంజూరు చేసి ఆడిటోరియంలో సీట్లు, కార్పెట్స్, ఇంటర్నల్ రోడ్స్, ఫోర్టికో, మెయిన్ గేట్స్, సౌండ్‌ప్రూప్, లైటింగ్ సంబంధించిన 95 శాతం పనులు పూర్తి చేశారు. గార్డెనింగ్, ల్యాన్ తదితర పనులకు మరో రూ.కోటిన్నర వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
స్వాధీనం చేసుకొని మునిసిపల్ శాఖ
2023 నవంబర్ నాటికి కళావేదిక పూర్త య్యింది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రారంభింప చేయాలని నాటి ఎమ్మెల్యే భా స్కర్‌రావు కేసీఆర్ కళాభవన్‌గా నామకరణం చేశారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ బిజీగా ఉండడంతో మిర్యాలగూడకు రాలేక పోవడంతో నల్లగొండ సభలోనే ప్రారంభోత్సవం గావించారు. అనంతరం 2023 డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా బీఎల్‌ఆర్ గెలుపొందడంతో కళావేదికపై రాజకీయ రగడ మొదలైంది. మునిసిపపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించకుండానే కళావేదికకు కేసీఆర్ పేరును ఖరారు చేయడం సమజసం కాదని కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. ఎంపీ ఎన్నికల సమయం లో కళావేదికపై ఉన్న కేసీఆర్ పేరును మూసి వేసి కళావేదిక గేటుకు తాళం వేశారు. కాగా కళావేదికకు నిధులు మం జూరు చేసి నిర్మాణానికి తోడ్పాటునందించిన జైపాల్‌రెడ్డి పేరును ఖరారు చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కలెక్టర్‌కు సిఫార్సు చేసినట్లు తెలిసిం ది. నిర్మాణపనులు పూర్తి చేశాం. మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలని కాంట్రాక్టర్ లెటర్ ఇచ్చినట్లు చెబుతునప్పటికీ దానిని అధీ నం చేసుకోకుండా చేయ గేటుకు తాళం తీయకుండా వృఽథాగా వదిలి వేశారని ఆరోపిస్తున్నారు.
రాష్ట్రస్థాయి పోటీలునిర్వహించాలనుకుంటున్నాం
ఇటీవల సురభి నాటక సమాజం వారు 7 రోజుల పాటు నల్లగొండ, మహబూబ్‌నగర్ జోనల్ నాటక పోటీలు నిర్వహించేందుకు కళావేదికను ఇవ్వాలని కలెక్టర్ నుంచి లేఖ తెచ్చినప్పటికీ కోరాం. స్థానిక అధికారులు నిరాకరించారు. ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం జన్మదినం తెలుగు నా టక రంగదినోత్సవం సందర్భంగా మిర్యాలగూడలో రాష్ట్ర స్థాయి పాటలు, పద్యాలు, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించాలనుకుంటున్నాం. మిర్యాలగూడ కళాకేంద్ర భవన్‌లో పోటీలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని తెలుగు నాటక అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య ద్వారా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సంప్రదించాం. త్వరలోనే ప్రారంభిస్తామని హమీ ఇచ్చారు.
- పరిమి రామావతారం మిర్యాలగూడ కళాక్షేత్రం అధ్యక్షుడు, లక్ష్మీనారాయణ శర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పులి కృష్ణమూర్తి కార్యదర్శి