భారతీయ అమెరికన్‌కు 40 నెలల జైలు.. అతను చేసిన నేరమేంటో తెలుసా?
ABN , First Publish Date - 2021-08-25T08:22:39+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో ఒక భారతీయ అమెరికన్‌కు 40 నెలల జైలు శిక్ష విధించారు. కంపెనీ పెడదామని ఒక జంటను మోసం చేసిన కేసులో అతనికి ఈ శిక్ష విధించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఒక భారతీయ అమెరికన్‌కు 40 నెలల జైలు శిక్ష విధించారు. కంపెనీ పెడదామని ఒక జంటను మోసం చేసిన కేసులో అతనికి ఈ శిక్ష విధించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనీష్ సింగ్ అనే భారతీయ అమెరికన్ ఒక జంటను కలిశాడు. వారి భాగస్వామ్యంతో ఒక ఫ్యాబ్రిక్ కంపెనీ పెడదామని వారితో అన్నాడు. మనీష్ మాటలు నమ్మిన ఆ జంట దీనికి అంగీకరించింది. ఈ ప్రాజెక్టులో వీరి బాధ్యతలను చాలా స్పష్టంగా విభజించుకున్నారు. కంపెనీకి కావలసిన పెట్టుబడిని ఆ అమెరికన్ జంట పెడుతుంది. ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో తనకున్న కనెక్షన్స్ ద్వారా కంపెనీని అభివృద్ధి చేయడం మనీష్ పని. ఇలా ఈ జంట నుంచి మనీష్ సుమారు 1.26 మిలియన్ డాలర్లు తీసుకున్నాడు. భారతీయ లెక్కల్లో ఇది సుమారు రూ.8.9 కోట్లకు సమానం.
అయితే ఇంత డబ్బు తీసుకున్న 48 ఏళ్ల మనీష్.. దీనిలో ఒక్క పైసా కూడా కంపెనీ కోసం ఖర్చు పెట్టలేదు. కంపెనీకి కావలసిన ఫ్యాబ్రిక్ మొత్తం భారత్‌లో తయారవుతుందని అమెరికన్ జంటను నమ్మించి, ఆ డబ్బును తన జల్సాలకు వాడుకున్నాడు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో లైవ్ పోర్నోగ్రఫీ చూడటానికి ఈ డబ్బు మొత్తం తగలేశాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు అమెరికన్ జంట.. పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన అమెరికా కోర్టు.. మనీష్‌ను నిందితుడిగా తేల్చింది. అతనికి 40 నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది.