దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రి సనత్‌నగర్ ఈఎస్ఐ : కిషన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-08-23T23:07:08+05:30 IST
దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా నగరంలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా నగరంలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాడు ఈఎస్ఐ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించి రోగులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా ఈఎస్ఐ ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రధాని కార్యాలయం స్వయంగా మానిటరింగ్ చేస్తోందన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా కట్టడి అనేది ఏ ఒక్కరితోనో సాధ్యం కాదని.. ప్రజలందరూ సహకరించాలని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
