Shocking Incident: పట్టపగలే.. భర్త మృతదేహంతో లవర్ బైక్ పై చక్కర్లు
ABN , Publish Date - Mar 20 , 2025 | 02:48 PM
. ధన్నలాల్ సైని అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం గోపాలి దేవితో వివాహం జరిగింది. ధన్నలాల్ స్థానికంగా కూరగాయలు అమ్ముతూ.. కుటుంబాన్ని పోషించేవాడు. అలా కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఐదేళ్ల క్రితం వీరి జీవితంలోకి దీన్దయాల్ కుశ్వాహ అనే వ్యక్తి ప్రవేశించాడు. అప్పటి నుంచి వీరి జీవితం మారిపోయింది. గోపాలి దేవి, దీన్దయాల్ మధ్య పరిచయం పెరిగి..

పెళ్లికి ముందు ప్రేమ ఒకప్పటి మాట. మరి ఇప్పుడో అంటే.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఎవరు.. ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. ఒంటరి గాళ్లు ప్రేమలో పడి జంటగా మారితే పర్లేదు.. కానీ నేటి కాలంలో అందుకు విరుద్ధమైన ప్రేమలు తెరమీదకి వస్తున్నాయి. పెళ్లై పిల్లలున్న వారు కూడా ప్రేమలో పడుతున్నారు. ఇలా చేయడమే తప్పంటే.. తమ ప్రేమకు అడ్డు వస్తే.. కట్టుకున్న వాళ్లని, కన్న వాళ్లని, ఆఖరికి కడుపున పుట్టిన వారిని కూడా అంతమొందించడానికి వెనకాడటం లేదు. గత కొన్నాళ్లుగా మన సమాజంలో ఈ తరహా దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన మరో దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. లవర్ తో కలిసి భర్తను దారుణంగా హత్య చేయడమే కాక పట్టపగలు.. భర్త మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి.. తగలబెట్టిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..
ఈ దారుణం జైపూర్ లో వెలుగు చూసింది. ధన్నలాల్ సైని అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం గోపాలి దేవితో వివాహం జరిగింది. ధన్నలాల్ స్థానికంగా కూరగాయలు అమ్ముతూ.. కుటుంబాన్ని పోషించేవాడు. అలా కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఐదేళ్ల క్రితం వీరి జీవితంలోకి దీన్దయాల్ కుశ్వాహ అనే వ్యక్తి ప్రవేశించాడు. అప్పటి నుంచి వీరి జీవితం మారిపోయింది. గోపాలి దేవి, దీన్దయాల్ మధ్య పరిచయం పెరిగి.. అది కాస్త వివాహేతర బంధంగా మారింది.
దీనదయాల్ స్థానికంగా ఉన్న బట్టల షాప్ లో పని చేసేవాడు. ఇక గోపాలి దేవి తాను ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాని భర్తకు అబద్ధం చెప్పి ఇంటి నుంచి వెళ్లి దీన్దయాల్ ను కలుసుకునేది. కొన్నాళ్లకు గోపాలి దేవి తీరుపై ఆమె భర్తకు అనుమానం వచ్చింది. దాంతో ఆమెకు తెలియకుండా వెంబడించడంతో వీరి వ్యవహారం బయటపడింది. ఫ్యాక్టరీ లో పని అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన గోపాలి దేవి.. దీన్దయాల్ పని చేస్తున్న బట్టల షాప్ కు వెళ్లింది.
భార్యను వెంబడిస్తున్న వెళ్లిన ధన్నలాల్.. బట్టల షాష్ లో అభ్యంతరకర రీతిలో ఉన్న గోపాలి దేవి, దీన్దయాల్ ను పట్టుకున్నాడు. దీని గురించి వారిని నిలదీశాడు. ఈ క్రమంలో వారు మాట్లాడుకుందామని నమ్మించి ధన్నలాల్ ను పై అంతస్తులో ఉన్న మరో షాప్ కు తీసుకెళ్లారు. అనంతరం గోపాలి దేవి, ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి ధన్నలాల్ మీద దాడి చేశారు. ఐరన్ రాడ్ తో అతడి తలపై కొట్టి.. తాడుతో మెడకు ఉరి బిగించారు. ఈ క్రమంలో ధన్నలాల్ అక్కడికక్కడే చనిపోయాడు.
అనంతంరం గోపాలి దేవి, దీన్దయాల్ ఇద్దరు కలిసి ధన్నలాల్ శరీరాన్ని ఓ సంచిలో ప్యాక్ చేసి.. మోటర్ సైకిల్ మీద తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. వీరు ఓ మార్కెట్ గుండా వెళ్తుండగా.. అక్కడే ఉన్న సీసీటీవీలో గోపాలి దేవి, దీన్దయాల్ ఇరువురు ధన్నలాల్ డెడ్ బాడీని తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
రింగ్ రోడ్డు దగ్గరకు వెళ్లిన తర్వాత ధన్నలాల్ డెడ్ బాడీని కిందకు దించి.. నిప్పంటించారు. అలా అయితే పోలీసుల నుంచి తప్పించుకోవచ్చని గోపాలి దేవి, ఆమె ప్రియుడు భావించారు. అయితే డెడ్ బాడీ సగం కాలేసరికి.. ఆ ప్రాంతంలోకి ఓ కారు వచ్చింది. దాంతో నిందితులిద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత సగం కాలిన డెడ్ బాడీని ధన్నలాల్ దిగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా గోపాలి దేవి, దీన్దయాల్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు గోపాలి దేవిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న దీన్దయాల్ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
ఇవి కూడా చదవండి...
Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే
Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here