బడాయికి పోయి.. నవ్వులపాలు..!
ABN , First Publish Date - 2021-06-18T05:50:39+05:30 IST
ఇప్పటికే చేసిన పనులకు రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లుగా పైసా కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలివ్వలేకపోతున్నారు.

పెండింగ్‌లో రూ.45 కోట్లు బిల్లులు
ఉద్యోగులకు జీతాలివ్వలేని దైన్యం..
అయినా.. రూ.150 కోట్లతో
పనులకు ప్రతిపాదనలు
మొఖం చాటేస్తున్న కాంట్రాక్టర్లు
ఏపీఈడబ్ల్యూఓఐడీసీలో చోద్యం
అనంతపురం క్లాక్‌టవర్, జూన్ 17: ఇప్పటికే చేసిన పనులకు రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లుగా పైసా కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలివ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఓఐడీసీ) బడాయిలు పోతోంది. ఏకంగా రూ.150 కోట్లతో కొత్త పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నవ్వుల పాలైంది.
ఇదివరకు చేసిన పనులకు సంబంధించి రూ.45.13 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో మూడు మైనార్టీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.150కోట్లతో ప్రతిపాదనలు పంపారు. దీనికి ప్రభుత్వం ఆమోదం వేసి, టెండర్లు పిలిచారు. బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం కొత్త బిల్లులు ఎలా ఇస్తుందని టెం డర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఏపీఈడబ్ల్యూఓఐడీసీలో టెండర్ల ప్రక్రియ అభాసుపాలైంది. రెండేళ్లుగా నిర్మాణాలకు స ంబంధించి చిల్లిగవ్వ కూడా ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడం గమనార్హం. బిల్లులు కాలేదని ఆ శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు, సిబ్బందికి జీతాలు కూడా నిలుపుదల చేశారు. పాత బిల్లులు చెల్లింపునకే దిక్కులే దు... ఇక కొత్త ప్రతిపాదనలు, టెండర్లు అవసరమా అంటూ కాంట్రాక్టర్లు నివ్వెరపోతున్నారు.
జిల్లాలో రూ.45.13 కోట్ల బిల్లులు పెండింగ్
ఏపీఈడబ్ల్యూఐడీసీలో 9 శాఖలకు సంబంధించి నిర్మాణాలకు రూ.45. 13 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో సాంకేతిక విద్యాశాఖకు సంబంధించి రూ.2.39కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకు రూ.10లక్షలు, సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు రూ.17 లక్షలు, ఏపీ సాంఘిక సంక్షేమశాఖ గురుకులపాఠశాలలకు సంబంధించి రూ.11.43 కోట్లు, బీసీ సంక్షేమ శాఖలో రూ.24.60 కోట్లు, మైనార్టీ సంక్షేమంలో రూ..6.60 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లుగా నిర్మాణాలకు సంబంధించి పైసా కూడా ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొందరు కాంట్రాక్టర్లు సొంత డబ్బుతో పనులు పూర్తి చేసి, బిల్లులు రాక అప్పులపాలయ్యారు.
కొత్తగా రూ.కోట్లలో ప్రతిపాదనలు
జిల్లాలో మూడు మైనార్టీ బాలుర రెసిడెన్షియిల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి ఏపీఈడబ్ల్యూఓఐడీసీ ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం వీటికి ఆమోదం తెలిపి, పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది. జిల్లాలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కదిరి, హిందూపురం, తాడిపత్రిలో మూడు మైనార్టీ బాలుర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను రూ.50కోట్లు ఒక్కొక్కటి చొప్పున మొత్తం రూ.150 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. వాటికి హిందూపురంలో 6, తాడిపత్రి, కదిరిలో ఐదెకరాల చొప్పున స్థలాలను గుర్తించారు. నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. పాత బకాయిలే చెల్లింలేనపుడు.. కొత్తవాటికి ప్రభుత్వం బిల్లులు ఎప్పుడు ఇస్తుందో అంటూ కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ఆసక్తి చూపట్లేదు.
ఆరు నెలలుగా ఉద్యోగులకు జీతాల్లేవ్
ఆరు నెలలుగా ఏపీఈడబ్ల్యూఓఐడీసీలో పనిచేస్తున్న ఇంజనీర్లు, సిబ్బందికి ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కరోనా కష్టకాలంలో జీతాలు చెల్లించకుంటే ఉద్యోగులు ఎలా బతుకుతారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందులో పనులు జరగకపోవడం, బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో జీతాలు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది.
బిల్లులు పెండింగ్ వాస్తవమే : - శివరామ్‌ప్రసాద్, ఈఈ, ఏపీఈడబ్ల్యూఐడీసీ
వివిధ నిర్మాణాలకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవమే. చాలా కా లంగా పెండింగ్ ఉన్న బిల్లుల చెల్లింపు విష యం ఇప్పటికే పలుమార్లు ఉన్నతాఽధికారుల దృ ష్టికి తీసుకెళ్లాం. ఇంజనీర్లు, సిబ్బందికి కూడా జీతా లు చెల్లించలేదు. మూడు మైనార్టీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాలల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాం. టెండర్లకు కాంట్రాక్లర్లు ఆసక్తి చూ పట్లేదు. విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం.