Chennai: నిండు కుండల్లా చెరువులు

ABN , First Publish Date - 2021-11-10T15:53:42+05:30 IST

భారీ వర్షాలకు రాష్ట్రంలోని చెరువులన్నీ నీటితో నిండిపోయి నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,691 చెరువుల్లో పూర్తిసామర్థ్యం మేరకు నీరు వచ్చి చేరింది. మరో 2,964 చెరువుల్లో 76 శాతం

Chennai: నిండు కుండల్లా చెరువులు

అడయార్‌(చెన్నై): భారీ వర్షాలకు రాష్ట్రంలోని చెరువులన్నీ నీటితో నిండిపోయి నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,691 చెరువుల్లో పూర్తిసామర్థ్యం మేరకు నీరు వచ్చి చేరింది. మరో 2,964 చెరువుల్లో 76 శాతం నుంచి 90 శాతం మేరకు నీరు వచ్చి చేరింది. రాష్ట్రంలో నీటిపారుదల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న 14,138 చెరువులకు గాను 3,691 చెరువుల్లో పూర్తి సామర్థ్యం మేరకు నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా అరియలూరులో 32 చెరువులు, చెన్నైలో మూడు, చెంగల్పట్టులో 197, కోయంబత్తూరులో 14, కడలూరులో 120, దిండిగల్‌లో 38, ఈరోడ్‌లో 3, కాంచీ పురంలో149, కళ్ళకురిచ్చిలో 127, కన్నియకుమారిలో 287, కృష్ణగిరిలో 47, మదురైలో 555. నామక్కల్‌లో 20, పెరంబలూరులో 10, పుదుక్కోటలో 184, రామనాథపురంలో 10, రాణిపేట లో 17, సేలంలో 30, శివగంగైలో 75, తెన్‌కాశిలో 333, తంజావూరులో 306, తేనిలో 24, తూత్తుకుడి లో 80, తిరుచ్చిలో 27, తిరునెల్వేలిలో 178, తిరు పత్తూరులో 19, తిరుపూరులో 5, తిరువళ్ళూరులో 245, తిరువణ్ణామలైలో 258, తిరువారూరులో 2, వేలూరులో 53, విల్లుపురంలో 172, విరుదునగర్‌లో 3 చెరువులు పూర్తిగా నిండాయి.


మెట్టూరు డ్యాం నుంచి నీరు విడుదల : 

12 జిల్లాలకు వరద హెచ్చరిక

 సేలం జిల్లాలోని మెట్టూరు రిజర్వాయర్‌కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్‌ నుంచి 20 వేల ఘనపుటుడుగుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఫలితంగా 12 జిల్లాలకు వరద హెచ్చరికను జారీచేశారు. కావేరి నది ఒడ్డున ఉన్న సేలం, నామక్కల్‌, ఈరోడ్‌, కరూర్‌, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, తిరువారూర్‌, మైలాడుదురై, నాగపట్టణం, పుదుక్కోట్ట జిల్లాలకు వరద హెచ్చరికను జారీచేశారు. అదేవిధంగా చెన్నై మహనగరానికి మంచినీటిని సరఫరా చేసే పూండి, చెంబరంబాక్కం చెరువుల నుంచి కూడా నీటిని కిందకి వదిలివేస్తున్నారు. ప్రస్తుతం పూండి రిజర్వాయర్‌లో 2712 మిలియన్‌ ఘనపుటడుగుల నీరు నిల్వవుంది. అదేసమయంలో ఈ రిజర్వాయర్‌కు సెకనుకు 3256 ఘనపుటడుగుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో పూండి రిజార్వయర్‌ నుంచి 5 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా చెంబరంబాక్కం చెరువు నుంచి కూడా భారీ మొత్తంలో నీటికి కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో అడయారు కూవం కాలువ ఒడ్డుకు ఇరువైపుల ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Updated Date - 2021-11-10T15:53:42+05:30 IST