అర్ధరాత్రి వరకూ ఆఫీసులో డ్యూటీ.. తెల్లారేసరికి తల్లి అయిన మేయర్!

ABN , First Publish Date - 2021-02-13T16:06:42+05:30 IST

కర్మే నిజమైన పూజ అని చెబుతుంటారు. దానికి...

అర్ధరాత్రి వరకూ ఆఫీసులో డ్యూటీ.. తెల్లారేసరికి తల్లి అయిన మేయర్!

జైపూర్: కర్మే నిజమైన పూజ అని చెబుతుంటారు. దానికి ఉదాహరణగా రాజస్థాన్‌లోని జైపూర్ గ్రేటర్ మున్సిపాలిటీ మేయర్ డాక్టర్ సౌమ్యా గుర్జర్ నిలిచారు. ఆమె గత బుధవారం అర్థరాత్రి వరకూ ఆఫీసు కార్యకలాపాల్లో తలమునకలై, గురువారం ఉదయాన్నే ఒక మగశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


సౌమ్యా గుర్జర్ అర్థరాత్రి వరకూ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటల 30 నిముసాలకు ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడున్నవారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఉదయం ఐదు గంటలకు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా సౌమ్య తన ట్విట్టర్ ఖాతాలోపనే దైవం. అర్థరాత్రివరకూ మీటింగ్‌లో ఉన్నాను.  పురిటి నొప్పులు రాగానే 12 గంటలకు కుకున్ ఆసుపత్రిలో చేరాను. ఉదయం 5 గంటల 14 నిముషాలకు మగశిశువుకు జన్మనిచ్చాను. నేను, పిల్లాడు క్షేమంగానే ఉన్నాం అని తెలిపారు. ఈ పోస్టును చూసినవారంతా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Updated Date - 2021-02-13T16:06:42+05:30 IST