కనువిందు చేస్తున్న భీముని పాదం జలపాతం
ABN , First Publish Date - 2021-06-04T20:42:42+05:30 IST
మహబూబాబాద్‌లోని భీముని పాదం జలపాతం కనువిందు చేస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం

గూడూరు: మహబూబాబాద్‌లోని భీముని పాదం జలపాతం కనువిందు చేస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం ఉధృతిగా ప్రవహిస్తోంది. దీంతో జలపాతం జలకళ సంతరించుకున్నది. అంతెత్తు నుంచి పడుతున్న జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని స్థానికులు అంటున్నారు.
గూడూరు మండలంలోని కొమ్ములవంచ అటవీ ప్రాంతంలో ఈ భీమునిపాదం జలపాతం ఉంది. కోవిడ్ నిబంధనల కారణంగా భీముని జలపాతం వద్దకు పర్యాటకులకు అనుమతించడం లేదు. నిబంధనలు సడలించే వరకు జలపాత సందర్శనకు పర్యాటకులు రావద్దని అధికారులు తెలిపారు.