విద్యతో పాటు మాకు విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమే: సబిత

ABN , First Publish Date - 2021-01-31T21:36:30+05:30 IST

తెలంగాణలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు పునప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లోని ప్రభుత్వ స్కూళ్లను మంత్రి సబిత

విద్యతో పాటు మాకు విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమే: సబిత

కొల్లాపూర్: తెలంగాణలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు పునప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లోని ప్రభుత్వ స్కూళ్లను మంత్రి సబిత ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరగతి గదుల్లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామని తెలిపారు. ఒక గదికి 20 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. విద్యార్థుల మధ్య ఆరు ఫీట్ల దూరం ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. శానిటైజేషన్, మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయిస్తామన్నారు. ప్రతి పాఠశాలలో ఒక ఐసోలేషన్ రూమ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. 9,10 తరగతుల నిర్వాహణ పరిశీలించిన తర్వాత.. కిందస్థాయి తరగతులపై నిర్ణయం తీసుకుంటామని సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-01-31T21:36:30+05:30 IST