గరీబ్‌నగర్‌వాసుల కల నెరవేరింది: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-04-13T04:59:27+05:30 IST
గరీబ్‌నగర్‌వాసుల కల నెరవేరింది: ఎమ్మెల్యే

గీసుగొండ, ఏప్రిల్ 12: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గరీబ్‌నగర్ వాసుల కల నెరవేరిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఏనుమాముల మార్కెట్‌కు వెళ్లే 100 ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం గరీబ్‌నగర్ వాసులకు మంత్రి కేటీఆర్ ఇళ్ల పట్టాలను సోమవారం అందించారు. ధర్మారెడ్డి మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీ మేరకు 540 ఇండ్ల పట్టాలు మంజూరు అయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్ వద్ద బస్ యాక్సిడెంట్‌లో చనిపోయిన బాధిత కుటుంబాలకు మూడేళ్లయిన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా అందలేదని ఎలుకుర్తికి చెందిన ఐలోని అభిషేక్ మంత్రి కేటీఆర్‌కు గోడును వెళ్లబోసుకున్నారు. గరీభ్‌నగర్ రోడ్డు వద్ద మంత్రికి వినతి పత్రం అందించి ఆర్థికసాయం అందించా లని కోరారు.