ప్రజాప్రతినిధులను గౌరవించాలి

ABN , First Publish Date - 2021-01-05T04:10:21+05:30 IST

ప్రజాప్రతినిధులను గౌరవించాలి

ప్రజాప్రతినిధులను గౌరవించాలి
ఏవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర

మండల సభలో ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం

శాయంపేట, జనవరి 4: ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ తమ పనితీరును మార్చుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాయంపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని ఏవో గంగాజమునకు సూచించారు. అధికారులు సర్వసభ్య సమావేశానికి తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులకు ఫోన్‌లో అందుబాటులో ఉండి జవాబు ఇవ్వాలని సూచించారు. అనంతరం పీఆర్‌టీయూ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. జోగంపల్లి శివారులో గల చలివాగు ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌, వైస్‌ఎంపీపీ రాంశెట్టి లతలక్ష్మారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను అడ్డుకున్న దళితులు

గతంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లాక్కుంటుందని శాయంపేటకు చెందిన దళితులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అడ్డుకున్నారు. మండల సభను ముగించుకుని బయటకు వస్తుండగా దళితులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి తమ భూములను డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పేరుతో లాక్కోవద్దని వేడుకున్నారు. దళితులు మారెపల్లి సమయ్య, బుచ్చమ్మ, భాగ్య, కొమ్ముల సారయ్య, దైనంపెల్లి సిమోన్‌, రవి, మారెపల్లి క్రాంతికుమార్‌, సుధాకర్‌, రమేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-05T04:10:21+05:30 IST

News Hub