విజయమ్మ కొత్త నాటకం..: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-09-01T00:08:23+05:30 IST
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో అనుబంధం వేరు, రాజకీయాలు వేరని

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో అనుబంధం వేరు, రాజకీయాలు వేరని తెలిపారు. షర్మిల తెలంగాణ కొడలే అని.. కానీ విజయమ్మ ఏమవుతుందని ప్రశ్నించారు. ఏపీలో కొడుకు జగన్‌ను సీఎం సీటులో కూర్చోబెట్టి.. బీజేపీతో దోస్తాన చేస్తున్నారని ఆరోపించారు. కూతురు షర్మిలతో కలిసి విజయమ్మ.. తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. మరోవైపు గంజాయి మత్తులో ఉన్న యువతను.. బీజేపీ, ఎంఐఎం మత రాజాకీయలకు వాడుకుంటున్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు.