శ్రీనిధి కుటుంబాన్ని ఆదుకోవాలి: Alapati Raja
ABN , First Publish Date - 2022-07-18T00:51:02+05:30 IST
తెనాలి మండలం కొలకలూరు దళితవాడలో మాజీ మంత్రి ఆలపాటి రాజా (Ex Minister Alapati Raja) పర్యటించారు. ఇటీవల నీటి కాలుష్యంతో...

గుంటూరు (Guntur): తెనాలి మండలం కొలకలూరు దళితవాడలో మాజీ మంత్రి ఆలపాటి రాజా (Ex Minister Alapati Raja) పర్యటించారు. ఇటీవల నీటి కాలుష్యం (Water Polution)తో మృతి చెందిన శ్రీనిధి (Srinidhi) కుటుంబాన్ని ఆయన పరామర్శించించారు. శ్రీనిధి కుటుంబానికి టీడీపీ (Tdp) తరఫున రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ శ్రీనిధి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం (Ap Government) ఇంతవరకు నష్టపరిహారం అందించలేదన్నారు. శ్రీనిధి గత నెల 30న చనిపోయిన కారణమేంటో ఇంతవరకు తెలిలేయదని వ్యాఖ్యానించారు. ప్రజలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనపడుతుందని విమర్శించారు. 16 రోజుల్లో 70 మంది ఆసుపత్రి (Hospital) పాలైతే ఇంత వరకు కారణమేంటో తేల్చలేకపోయారని మండిపడ్డారు.
‘‘గ్రామంలో నీరు కలుషితం అవుతుందని ప్రజలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ అసమర్థత వల్లే గ్రామంలో నీరు కాలుష్యం అయింది. పంచాయతీ, ఇరిగేషన్, కలెక్టర్ ప్రజలకి సమాధానం చెప్పాలి. త్వరితగతిన నివేదిక అందించి.. బాధితురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలి. లేని పక్షంలో టీడీపీ తరపున ఆందోళన చేపడతాం.’’ అని ఆలపాటి రాజా హెచ్చరించారు.