TDP MP: ఏపీ అప్పులపై రాజ్యసభలో గళం విప్పిన టీడీపీ ఎంపీ కనకమేడల
ABN , First Publish Date - 2022-12-20T18:31:12+05:30 IST
ఏపీ అప్పులపై రాజ్యసభ (Rajya Sabha)లో టీడీపీ (TDP) ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) గళం విప్పారు.

ఢిల్లీ: ఏపీ అప్పులపై రాజ్యసభ (Rajya Sabha)లో టీడీపీ (TDP) ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) గళం విప్పారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను కేంద్రమే ఆదుకోవాలని ఎంపీ కనకమేడల అన్నారు. ఆర్ధికశాఖ పద్దులపై జరిగిన చర్చలో కనకమేడల పాల్గొన్నారు. తాహతుకు మించి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కనకమేడల విమర్శించారు. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సవరించిన అంచనాలను ఆమోదించాలని కనకమేడల కోరారు. ఎపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, మాచర్ల ఘటనలను ఎంపీ కనకమేడల సభ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో సరైన సమయానికి వేతనాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి పోయిందని, పనిచేసిన వారికి కూడా బిల్లులు చెల్లించే అవకాశాలు లేవని కనకమేడల తెలిపారు.