జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి : జడ్జి
ABN , First Publish Date - 2022-02-22T04:47:28+05:30 IST
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కె.లత అన్నారు.

నందలూరు, ఫిబ్రవరి 21 : జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కె.లత అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మార్చి 12వ తేదీ జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ప్రజలందరికీ సమన్యాయంతో అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులు ఇరువర్గాల ఆమోదంతో సత్వర పరిష్కారం చేసుకోవచ్చన్నారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కోర్టు నుంచి స్థానిక బస్టాండు కూడలి వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి నరసింహులు, ఏజీపీ షమీఉల్లాఖాన్, మాజీ ఏజీపీ మహమ్మద్ అలీ, న్యాయవాదులు మల్లికార్జున, హెచ్.ఆనంద్ కుమార్, సుబ్బరామయ్య, వినయ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.