Yanamala: బీసీల పేరెత్తే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు..

ABN , First Publish Date - 2022-12-04T12:50:36+05:30 IST

అమరావతి: బీసీల పేరెత్తే అర్హత కూడా సీఎం జగన్‌ (CM Jagan)కు లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు.

Yanamala: బీసీల పేరెత్తే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు..

అమరావతి: బీసీల పేరెత్తే అర్హత కూడా సీఎం జగన్‌ (CM Jagan)కు లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 56 కార్పొరేషన్లు పెట్టి, పైసా ఖర్చు చేయని దుర్మార్గ చరిత్ర జగన్‌దేనని విమర్శించారు. బీసీలంతా జగన్ పాలనలో మాకు ‘‘ఇదేం ఖర్మ’’ అంటున్నారన్నారు. టీడీపీ నినాదం 'జయహో బీసీ' నినాదాన్ని వైసీపీ కాపీ కొట్టడం సిగ్గుచేటన్నారు. టీడీపీ (TDP) బీసీ (BC)లకు అమలు చేసిన పథకాలను రద్దుచేసి బీసీ సభ ఏర్పాటా? అంటూ మండిపడ్డారు. సబ్‌ ప్లాన్‌ కింద నిధులు మళ్లించడం బీసీలను వంచించడం కాదా?.. వెయ్యికి పైగా ఉన్న నామినేటెడ్‌ పదవుల్లో బీసీలెందరు ఉన్నారని యనమల ప్రశ్నించారు.

బీసీలను రాజకీయంగా అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం మాత్రమేనని, టీడీపీ జయహో బీసీ అంటూ పదవులిస్తే.. జగన్ రెడ్డి నైనై బీసీ అంటూ తొక్కిపెట్టారని యనమల దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రెడ్లకు దారబోసి బీసీలను అణగదొక్కడం నిజం కాదా? అని ప్రశ్నించారు. జయహో బీసీ పేరుతో సభ పెట్టి ఏం చెప్పబోతున్నారని యనమల నిలదీశారు.

Updated Date - 2022-12-04T12:50:40+05:30 IST