Venkaiah Naidu: నెల్లూరులో తుఫాను ప్రభావంపై వెంకయ్య ఆరా
ABN , First Publish Date - 2022-12-12T09:24:08+05:30 IST
జిల్లాలో తుఫాను ప్రభావంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు.
నెల్లూరు: జిల్లాలో తుఫాను (Mandous Cyclone)ప్రభావంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) ఆరా తీశారు. కలెక్టర్ చక్రధర్ బాబుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెంకయ్యకు కలెక్టర్ వివరించారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్కు వెంకయ్యనాయుడు సూచించారు.