Anantapur JNTUలో ఎమ్మెస్సీ, ఎంటెక్
ABN , First Publish Date - 2022-11-04T14:41:58+05:30 IST
అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూఏ) - ఎమ్మెస్సీ, ఎంటెక్ రెగ్యులర్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్
అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూఏ) - ఎమ్మెస్సీ, ఎంటెక్ రెగ్యులర్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీకి చెందిన కాన్‌స్టిట్యుయెంట్ కాలేజీల్లో స్పాన్సర్డ్ కేటగిరీ సీట్లు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు టీచింగ్/ ఇండస్ట్రీ/ ఆర్ అండ్ డీ సంస్థల్లో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం తప్పనిసరి. పనిచేస్తున్న సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్ లెటర్‌ను దరఖాస్తుకు జతచేయాలి. అకడమిక్ ప్రతిభ, అనుభవం, గేట్ వ్యాలిడ్ స్కోర్/ ఏపీపీజీఈసెట్ 2022/ఏపీపీజీసెట్ 2022 స్కోర్, కౌన్సెలింగ్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్‌షి్‌పలు, స్టయిపెండ్‌లు, ఫీ రీయింబర్స్‌మెంట్ వర్తించవు.
ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లు - సీట్లు: జేఎన్‌టీయూఏ - ఓటీపీఆర్‌ఐ(ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)లో ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఒక్కోదానిలో ఏడు సీట్లు చొప్పున మొత్తం 14 సీట్లు ఉన్నాయి.
ఎంటెక్ స్పెషలైజేషన్‌లు - సీట్లు: అనంతపురంలోని జేఎన్‌టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, బ్రిడ్జ్ అండ్ టన్నెల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, పవర్ అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్, రిలయబిలిటీ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎనర్జీ సిస్టమ్స్, అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్ సిస్టమ్స్, ఇంటర్నల్ కంబక్షన్ ఇంజనీరింగ్, డిజిటల్ ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిఫెన్స్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫైన్ కెమికల్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. డిఫెన్స్ టెక్నాలజీ ప్రోగ్రామ్‌నకు డీఆర్‌డీఓ సహకారం అందిస్తుంది.
పులివెందులలోని జేఎన్‌టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, క్యాడ్/ క్యామ్, డిజిటల్ ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ ్క్ష ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి.
ఎంటెక్ ప్రోగ్రామ్‌లో స్పెషలైజేషన్‌కు ఏడు చొప్పున మొత్తం 175 సీట్లు ఉన్నాయి.
అర్హత: ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్/ హోం సైన్స్)/ బీఎస్సీ ఆనర్స్(ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీలో కెమిస్ట్రీతోపాటు ఫుడ్‌సైన్స్/బోటనీ/జువాలజీ/ఫిజిక్స్/ బయో కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/ సెరీకల్చర్/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలలో ఏవైనా రెండు సబ్జెక్ట్‌లు చదివినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో ద్వితీయ శ్రేణి మార్కులు ఉండాలి. ఏపీపీజీసెట్ 2022లో ర్యాంక్ సాధించి ఉండాలి.
ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణులు; ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/అప్లయిడ్ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)/ ఎంసీఏ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. గేట్ వ్యాలిడ్ స్కోర్ లేదా ఏపీపీజీఈసెట్ 2022లో ర్యాంక్ సాధించి ఉండాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 5
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం, జేఎన్‌టీయూఏ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, అనంతపురం
వెబ్‌సైట్: www.jntua.ac.in