2.3 Foot Tall man: ఎట్టకేలకు కుదిరిన పెళ్లి.. మోదీ, యోగిని ఆహ్వానించనున్న అజీమ్

ABN , First Publish Date - 2022-10-30T17:48:09+05:30 IST

షామ్లి: 2.3 అడుగుల ఎత్తే అతని పెళ్లికి ప్రధాన అవరోధంగా నిలిచింది. ఎట్టకేలకు అతని పట్టుదలే గెలిచింది. వివాహం కుదిరింది. తన పెళ్లి అందరికీ గుర్తిండిపోయేలా జరగాలని అనుకున్నాడు. పెళ్లికి ముఖ్య అతిథులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లను ఆహ్వానించనున్నాడు.

2.3 Foot Tall man: ఎట్టకేలకు కుదిరిన పెళ్లి.. మోదీ, యోగిని ఆహ్వానించనున్న అజీమ్

షామ్లి: పెళ్లి అతని చిరకాల డ్రీమ్. దానిని సాకారం చేసుకోవడానికి తిరగని చోటంటూ లేదు, సంప్రదించని వ్యక్తంటూ లేడు. వివాహం కాలేదని తెగ బాధపడిపోయే వాడు. 2.3 అడుగుల ఎత్తే (2.3 foot tall man) అతని పెళ్లికి ప్రధాన అవరోధంగా నిలిచింది. ఎట్టకేలకు అతని పట్టుదలే గెలిచింది. వివాహం కుదిరింది. తన పెళ్లి అందరికీ గుర్తిండిపోయేలా జరగాలని అనుకున్నాడు. పెళ్లికి ముఖ్య అతిథులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi adityanath) లను ఆహ్వానించనున్నాడు. యూపీలోని షామ్లి జిల్లాకు చెందిన ఈ బుడ్డోడి పేరు అజీమ్ మన్సూరి (Azeem mansoori). రాబోయే నవంబర్ 7వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది.

వధువును వెతికి పెట్టమంటూ పలువురు రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ చెప్పులరిగి పోయేలా అజీం తిరిగాడట. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను సైతం కలిసి, తనకు సరిపడే సంబంధం చెప్పమని కోరాడట. ఏళ్ల తరబడి నజీం ఆరాటం, పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తన కలల రాకుమారి బుషరాను గత ఏడాది మార్చిలో కలుసుకున్నాడు. పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఎగిరి గంతేశాడు. వధువు ఎత్తు 3 అడుగులు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నజీం కూడా కొద్దిగా చదువుకున్నాడు కానీ ఐదో తరగతి మధ్యలోనే ఆపేశాడు. షామ్లీ జిల్లాలో సౌందర్య సాధనాల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

Updated Date - 2022-10-30T18:09:44+05:30 IST