ఒకే రోజు 23 క్షిపణి ప్రయోగాలు

ABN , First Publish Date - 2022-11-03T04:45:18+05:30 IST

ఉభయ కొరియా దేశాలు మరోమారు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. బుధవారం ఉత్తరకొరియా 23 క్షిపణులను ప్రయోగించగా, వాటిలో కనీసం ఒకటి దక్షిణ కొరియా

ఒకే రోజు 23 క్షిపణి ప్రయోగాలు

దూకుడు పెంచిన ఉత్తరకొరియా

దక్షిణకొరియాలో సైరన్‌ల మోత

సియోల్‌, నవంబరు 2: ఉభయ కొరియా దేశాలు మరోమారు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. బుధవారం ఉత్తరకొరియా 23 క్షిపణులను ప్రయోగించగా, వాటిలో కనీసం ఒకటి దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలో పడింది. దీంతో దక్షిణకొరియా వ్యాప్తంగా సైరన్‌ల మోత మార్మోగింది. జనాన్ని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి భూగర్భ స్థావరాల్లోకి తరలించారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు తక్షణమే ధీటైన జవాబివ్వాలని దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యియోల్‌ అధికారులను ఆదేశించారు. దీంతో దక్షిణ కొరియా నుంచి కూడా సరిహద్దు వైపు క్షిపణులు దూసుకెళ్లాయి. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా భీకర స్థాయిలో నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ క్షిపణి ప్రయోగాలు జరగడం గమనార్హం. అణ్వాయుధాలు సైతం ప్రయోగిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉత్తర కొరియాతో తమకు ఏ విధమైన శత్రుత్వమూ లేదని, అయితే, ఉత్తరకొరియా అణ్వాయుధాలను నిలువరించేందుకు మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామని అమెరికా స్పష్టం చేసింది. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద కూడా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు ఆమోదనీయం కాదని ఖండించారు.

Updated Date - 2022-11-03T04:45:19+05:30 IST