China-Pakistan new virus: చైనా-పాక్ రహస్య కుట్ర.. కరోనా కన్నా ప్రాణాంతక వైరస్‌ తయారీ?

ABN , First Publish Date - 2022-11-08T22:10:09+05:30 IST

కొవిడ్-19 (Covid-19) తొలి కేసు గుర్తించి రెండేళ్లు దాటిపోయింది. ఇంకా కొత్తకొత్త వేరియెంట్లతో ప్రపంచం సతమతమవుతూనే ఉంది.

China-Pakistan new virus: చైనా-పాక్ రహస్య కుట్ర.. కరోనా కన్నా ప్రాణాంతక వైరస్‌ తయారీ?

రావల్పిండి: కొవిడ్-19 (Covid-19) తొలి కేసు గుర్తించి రెండేళ్లు దాటిపోయింది. ఇంకా కొత్తకొత్త వేరియెంట్లతో ప్రపంచం సతమతమవుతూనే ఉంది. కొవిడ్ భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోని పరిస్థితుల మధ్య, ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా చైనా (China), పాకిస్తాన్‌లు (Pakistan) రహస్య జీవాయుధాల అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ రెండు దేశాలు పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఓ రహస్య ల్యాబ్‌లో కరోనా కంటే ప్రాణాంతకమైన వైరస్‌ను తయారు చేస్తున్నాయంటూ పలు రిపోర్టులు పేర్కొన్నాయి.

చైనా-పాక్‌ల ఉమ్మడి పన్నాగం పర్యవసనాలు కరోనా కంటే చాలా భయకరంగా ఉండబోతున్నాయని సదరు కథనాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని ఓ రహస్య ల్యాబ్‌లో ఈ వైరస్‌ను తయారు చేస్తున్నారని తెలిపాయి. ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలోని పనిచేసే డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ (DSTO) ఉమ్మడిగా అత్యాధునిక సదుపాయాలతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశాయి. ఈ ల్యాబ్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారని రిపోర్టులు వెల్లడించాయి.

Updated Date - 2022-11-08T22:10:50+05:30 IST