Coast Guard: సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించిన కోస్ట్‌గార్డ్
ABN , First Publish Date - 2022-12-09T09:14:28+05:30 IST
కడలూరుకు సమీపంలో సముద్రంలో చిక్కుకున్న ముగ్గురిని కోస్ట్‌గార్డ్(Coast Guard) అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్ (ఏఎల్‌హెచ్) ద్వారా రక్షించారు.

అడయార్(చెన్నై), డిసెంబరు8: కడలూరుకు సమీపంలో సముద్రంలో చిక్కుకున్న ముగ్గురిని కోస్ట్‌గార్డ్(Coast Guard) అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్ (ఏఎల్‌హెచ్) ద్వారా రక్షించారు. మాండస్ తుపాను వచ్చే మార్గంలోని ఫ్లోటింగ్ ప్రొడక్షన్ యూనిట్ (ఎఫ్‌పీయు)లో ఈ ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. వీరి గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్ విభాగానికి సమాచారం వచ్చింది. ఆ వెంటనే ఏఎల్‌హెచ్‌ను అప్రమత్తం చేసి అత్యవసరంగా రక్షణ చర్యలను చేపట్టి, ఆ ముగ్గురుని సురక్షితంగా రక్షించారు. ఈ ప్రాంతంలో మాండస్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఏఎల్‌హెచ్ సిబ్బంది లెక్క చేయకుండా ధైర్యసాహసాలతో గురువారం ఉదయం రక్షించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.