Kalaburagi Railway Station: రైల్వేస్టేషనుకు ఆకుపచ్చరంగు...హిందూ సంఘాల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-12-13T12:08:10+05:30 IST
కర్నాటకలోని కలబురగి రైల్వే స్టేషన్ గోడలపై ఆకుపచ్చ పెయింట్ వేయడంపై ఆ ప్రాంతంలోని హిందూ అనుకూల సంఘాల....
కలబురగి: కర్నాటకలోని కలబురగి రైల్వే స్టేషన్ గోడలపై ఆకుపచ్చ పెయింట్ వేయడంపై ఆ ప్రాంతంలోని హిందూ అనుకూల సంఘాల ఆగ్రహానికి దారితీసింది.(Kalaburagi Railway Station) రైల్వేస్టేషనుకు ఆకుపచ్చ రంగు వేయడంపై మంగళవారం హిందూ సంఘాల కార్యకర్తలు(Pro Hindu Groups) నిరసన ప్రదర్శన జరిపారు.ఆకుపచ్చ రంగు వేయడం వల్ల కలబురగి రైల్వే స్టేషన్ మసీదులా ఉందని హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.(Karnataka)కలబురగి రైల్వేస్టేషనుకు వేసిన ఆకుపచ్చ రంగును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపారు. హిందూ సంఘాల కార్యకర్తల ఆగ్రహంతో రైల్వేస్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.