గుజరాత్‌లో కమాల్.. హిమచల్ ఢమాల్

ABN , First Publish Date - 2022-12-09T01:38:47+05:30 IST

గుజరాత్‌లో కమలం గుబాళించింది! మునుపెన్నడూ కనీవినీ ఎరుగనిరీతిలో 53ు ఓట్లు.. 156 సీట్లతో చరిత్రాత్మక విజయం సాధించింది!! ఏడు వరుస విజయాలతో పశ్చిమ బెంగాల్‌లో ‘ఎర్ర దండు’

గుజరాత్‌లో కమాల్.. హిమచల్ ఢమాల్

మోదీ గడ్డపై బీజేపీ భారీ గెలుపు.. నడ్డా రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేతిలో ఓటమి

రెండు కాదు.. ఒకటే!

బీజేపీకే ‘సాత్‌’

గుజరాత్‌లో వరుసగా 7వ సారి విజయబావుటా

53ు ఓట్లు.. 156 సీట్లతో చరిత్ర సృష్టించిన బీజేపీ

17 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్‌.. 5 స్థానాల్లో ఆప్‌

భూపేంద్రకు 1.9 లక్షల మెజారిటీ.. 12న ప్రమాణం

విజయం వెనుక మోదీ కరిజ్మా.. పక్కా ప్రణాళిక

హిమాచల్‌ ‘హస్త’గతం

అత్యధికంగా 40 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్‌

బీజేపీకి 25, ఇతరులు 3, ఖాతా తెరవని ఆప్‌

మరోసారి కొనసాగిన సంప్రదాయం

కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఓట్ల తేడా 0.9 శాతమే

20 వేల ఓట్ల తేడాతో అధికారానికి బీజేపీ దూరం

15 మందికి 2వేల లోపు మెజారిటీయే!

ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ సన్నాహాలు

ఎన్నికైన ఎమ్మెల్యేలతో చండీగఢ్‌లో సమావేశం

సీఎం రేసులో మాజీ సీఎం వీరభద్రసింగ్‌ భార్య

ముకేశ్‌ అగ్నిహోత్రి, సుఖ్విందర్‌ సుఖు పేర్లు కూడా..

కాంగ్రెస్‌ను గెలిపించిన కీలక హామీలు

అనుకూలించిన ప్రియాంక ప్రచారం

గుజరాత్‌ (182) బీజేపీ 156

హిమాచల్‌ (68) కాంగ్రెస్‌ 40

ఎవరి ఆనందం వాళ్లది..

ఈ నిర్ణయాత్మక విజయం అందించినందుకు హిమాచల్‌ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు. ఈ విజయం వెనుక కార్యకర్తల కఠోర శ్రమ, అంకిత భావం ఉంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ వీలైనంత త్వరగా నెరవేర్చుతాం.

రాహుల్‌ గాంధీ

గుజరాత్‌లో కమలం గుబాళించింది! మునుపెన్నడూ కనీవినీ ఎరుగనిరీతిలో 53ు ఓట్లు.. 156 సీట్లతో చరిత్రాత్మక విజయం సాధించింది!! ఏడు వరుస విజయాలతో పశ్చిమ బెంగాల్‌లో ‘ఎర్ర దండు’ నెలకొల్పిన రికార్డును.. గుజరాత్‌లో ‘కాషాయ దళం’ సమం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ 17 సీట్లకు పరిమితం కాగా.. 12ు ఓట్లు, ఐదు సీట్లతో ఆప్‌ సత్తా చాటింది. హిమాచల్‌ ప్రదేశ్‌ ‘హస్త’గత మైంది! మొత్తం 68 సీట్లకుగాను 40 సీట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కానీ.. అక్కడ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 0.9 శాతమే!! గుజరాత్‌లో బీజేపీ అఖండ విజయం గొప్ప విషయమేగానీ.. కాంగ్రెస్‌ అంత నిరుత్సాహ పడే పరిస్థితీ లేదు. ఎందుకంటే.. అక్కడ ఓడినా బీజేపీ అధ్యక్షుడైన నడ్డా సొంతరాష్ట్రం హిమాచల్‌లో విజయం ఆ పార్టీ భవిష్యత్తు ఆశలను కొంతలో కొంత సజీవంగా ఉంచింది. ఇక ఈ 2 రాష్ట్రాల ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఏడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి వచ్చినవి రెండు సీట్లే. మొన్న ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఆప్‌ చేతిలో కాషాయ పార్టీ ఓడింది.

Updated Date - 2022-12-09T01:38:56+05:30 IST