Koyambedu Market: మార్కెట్‌లో తగ్గనున్నకూరగాయల ధరలు

ABN , First Publish Date - 2022-11-17T10:56:19+05:30 IST

కోయంబేడు మార్కెట్‌(Koyambedu Market)కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయల లారీలు వస్తుంటాయి. ఒక్కో

Koyambedu Market: మార్కెట్‌లో తగ్గనున్నకూరగాయల ధరలు

అడయార్‌(చెన్నై), నవంబరు 16: కోయంబేడు మార్కెట్‌(Koyambedu Market)కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయల లారీలు వస్తుంటాయి. ఒక్కోసారి వీటి విక్రయాలు జోరుగా సాగుతుంటా యి. మరికొన్ని సందర్భాల్లో కూరగాయల అమ్ముడుపోవు. దీంతో వాటిని చెత్తలో పడేస్తుంటారు. ఈ నేపథ్యంలో కూరగాయలు వృథా కాకుండా ఉండేలా మార్కెట్‌ వ్యాపారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్‌ లేని సమయంలో వీటి ధరలను తగ్గించనున్నారు. ఇదేవిషయంపై మార్కెట్‌కు చెందిన ఓ వ్యాపారి మాట్లాడుతూ, భారీ వర్షాలకు మార్కెట్‌లో చిల్లర వ్యాపారం 30 శాతం మేరకు తగ్గిందన్నారు. దీంతో అనేక రకాల కూరగాయలు కుళ్లి వృథా అవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీటి ధరలను 20 నుంచి 30 శాతం మేరకు తగ్గించి విక్రయిస్తున్నట్టు తెలిపారు. దీంతో మంగళ, బుధవారాల్లో ఆశాజనకంగానే విక్రయాలు జరిగాయని చెప్పారు.

Updated Date - 2022-11-17T10:56:21+05:30 IST