Court Blast Case:లూథియానా కేసులో ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-12-02T08:53:15+05:30 IST
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లూథియానా కోర్టు బాంబు పేలుడు ప్రధాన కుట్రదారుడిని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో...

న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లూథియానా కోర్టు బాంబు పేలుడు ప్రధాన కుట్రదారుడిని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారి శుక్రవారం తెలిపారు.పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నివాసం ఉంటున్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ మలేషియాను(Terrorist Harpreet Singh) కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ(Delhi) విమానాశ్రయానికి వచ్చిన కొద్దిసేపటికే అరెస్టు(Arrest) చేసినట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.గతేడాది డిసెంబరులో లూథియానా(Ludhiana) కోర్టు భవనంలో జరిగిన భారీ బాంబు పేలుడులో(Court Blast Case) ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి.
లూథియానా పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును ఎన్ఐఏ స్వీకరించింది. పాకిస్థాన్‌కు చెందిన సెల్ఫ్-స్టైల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) చీఫ్ లఖ్‌బీర్ సింగ్ రోడ్ సహచరుడు సింగ్ లూథియానా కోర్ట్ బిల్డింగ్ పేలుడు కుట్రదారుల్లో ఒకడని దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ అధికారి తెలిపారు.అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని, ఎన్‌ఐఏ వివరించింది.హర్‌ప్రీత్ సింగ్ ఆచూకీ చెప్పినా, పట్టిచ్చిన వారికి రూ.10లక్షల రివార్డు ప్రకటించారు. అతనిపై లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు.