NRI: గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో కల్చరల్ ఈవెంట్

ABN , First Publish Date - 2022-10-31T19:42:59+05:30 IST

వాషింగ్టన్ డీసీలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సీతా రామం’ బృందం, ప్రముఖ సినీ నటులు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, స్వప్న దత్, హను రాఘవపూడి ఇతర సంగీత కళాకారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

NRI: గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో కల్చరల్ ఈవెంట్

భాష.. సాంస్కృతిక వారధి అని సాయిసుధా పాలడుగు అన్నారు. వాషింగ్టన్ డీసీలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సీతా రామం’ బృందం, ప్రముఖ సినీ నటులు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, స్వప్న దత్, హను రాఘవపూడి ఇతర సంగీత కళాకారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సాయిసుధా పాలడుగు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షురాలు సాయి సుధ మాట్లాడుతూ.. భాష నాగరికతను నేర్పిస్తుందని వ్యాఖ్యానించారు. తెలుగుభాష తియ్యందనాన్ని, తెలుగుజాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమెరికా తెలుగు సంఘాల్లో జీడబ్ల్యూటీఎస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికాలో ఉన్న అన్ని సంస్థల కంటే ఈ సంస్థకి సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. తెలుగు భాషను, సంస్కృతీ సంప్రదాయాలను ఘనంగా చాటుతూ, గత 47 సంవత్సరాలుగా తెలుగు గొప్పదనాన్ని ప్రతి తరానికి దగ్గర చేస్తూ ముందుకు సాగుతుందన్నారు.

ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘‘ఇంత మంది తెలుగువారిని ఒకచోట కలుసుకోవటం సంతోషంగా ఉంది. నా సినిమాలను అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలు బాగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు. కాలం మారుతున్నా, నాగరికత మారుతున్నా, సంస్కృతి మారుతున్నా.. అమెరికాలో ఉన్న తెలుగువారు మాత్రం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, పండుగలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఒక మహిళగా సాయిసుధా ఈ సంస్థను సమర్థంగా నడిపించారు’’ అని కొనియాడారు. సినీ నటి మృణాళ్ ఠాకూర్ మాట్లాడుతూ.. సీతారామం చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్వప్న దత్ మాట్లాడుతూ.. అనేకమంది నటులకు తెలుగు సినీ పరిశ్రమ అవకాశాలు కల్పించిందన్నారు.

ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, నరేన్ కొడాలి, కృష్ణ లాం, మన్నవ సుబ్బారావు, సత్య సూరపనేని, వెంకట్రావు మూల్పూరి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు చంద్ర మాలవత్తు, రవి అడుసుమిల్లి, విజయ్ అట్లూరి, సుష్మా అమరుత్తలూరి, రాజేష్ కాసరనేని, భాను మాగులూరి, ఉమాకాంత్ రఘుపతి, ప్రవీణ్ కొండగ, శ్రీవివాస్ గంగ, యష్ బద్దులూరి, శ్రీ విద్యా సోమ, సురేష్ పాలడుగు, మన్నె సుశాంత్, ఫణి తాళ్లూరి, మన్నె సత్యనారాయణ, తానా 2023 కాన్ఫరెన్స్ ఛైర్మన్ రవి పొట్లూరి, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు.

తానా(TANA), ఆటాతో(ATA) సహా పలు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. GWTCS ప్రస్థానంలో ఈ కార్యక్రమం మరో మైలు రాయిగా నిలిచిపోతుంది. ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి వేలసంఖ్యలో హాజరయ్యారు. సమాజసేవలో ముందున్న పలువురికి దుల్కర్ సల్మాన్ జ్ఞాపికలు అందజేశారు. చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అందరినీ అలరించాయి.

6.jpg5.jpg4.jpg3.jpg2.jpg

Updated Date - 2022-10-31T19:45:21+05:30 IST