Bandla Ganesh: ‘ధమాకా’ స్పీచ్‌లో నోరు జారిన బండ్లన్న.. మాములు బూతు కాదు బాబోయ్..!
ABN , First Publish Date - 2022-12-30T14:06:02+05:30 IST
నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ (Producer and actor Bandla Ganesh is in the news again) ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు, ఉండాలని అనుకుంటాడో ఏమో మరి, అందుకే కొంచెం వివాదాస్పదంగా మాట్లాడటం, ట్వీట్ చెయ్యటం చేస్తూ ఉంటాడు.
నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ (Producer and actor Bandla Ganesh is in the news again) ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు, ఉండాలని అనుకుంటాడో ఏమో మరి, అందుకే కొంచెం వివాదాస్పదంగా మాట్లాడటం, ట్వీట్ చెయ్యటం చేస్తూ ఉంటాడు. నిన్న జరిగిన 'ధమాకా' (Dhamaka success meet) విజయ సదస్సుకి బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా (Special guest) హాజరయ్యాడు. బండ్ల గణేష్‌కు మాట్లాడటానికి మైక్ ఇవ్వగానే ‘ధమాకా’ సినిమా దర్శకుడు నక్కిన త్రినాధరావును ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీరు సినిమా ఇరగ దె.... సార్’ (ఆ బూతు పదం ఇక్కడ రాయడానికి కూడా ఇబ్బందిగా అనిపించేంతలా ఉంది) అన్నాడు. ఒక సెలబ్రిటీ అయిన బండ్ల గణేష్ ఇలా పబ్లిక్ మీటింగ్‌లో అలాఎలా మాట్లాడుతాడని నెట్టింట తీవ్ర విమర్శలొచ్చాయి. ట్రోలర్స్, మీమర్స్ ఆ వీడియోతో బండ్ల గణేష్‌ను ఆడేసుకున్నారు. పైగా ధమాకా ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ కావడంతో టీవీల్లో చూసిన వాళ్లు కూడా బండ్ల అనేసిన ఆ ఒక్క మాటతో అవాక్కయ్యారు. ‘బండ్లన్న మాస్ అనుకున్నాం గానీ ఊర నాటు’ అని వెటకారం చేసిన పరిస్థితి.
బండ్ల గణేష్ ఫ్లోలో ఏది వస్తే అది మాట్లాడేస్తుండటని, నోటి తుత్తర ఎక్కువని టాలీవుడ్‌లో ఒక టాక్ ఉంది. త్రివిక్రమ్ గురించి బండ్ల మాట్లాడిన కాల్ ఆడియో లీక్ అవడం, ఆ తర్వాత ఆ కాల్‌లో మాట్లాడింది తానేనని బండ్ల గణేష్ కూడా ఒప్పుకోవడంతో ఈ షాద్ నగర్ చిన్నోడితో ఎట్లుంటదో అందరికీ తెలిసొచ్చింది. ఒక ఈవెంట్‌కు పిలిచినప్పుడు ఆ సినిమా దర్శకుడిని, హీరోను పొగడ్తలతో ముంచెత్తాలనుకోవడం తప్పేం కాదు గానీ మరీ ఆ తపనలో బూతులు వాడి మరీ అంత పచ్చిగా, నాటుగా పొగడటం కూడా కొంత వెగటుగానే అనిపిస్తుంది. వాళ్లలో వాళ్లు బయట ఏం మాట్లాడుకున్నా ఎవరికీ నష్టం లేదు గానీ, ఇలా వేదికల మీద మాట్లాడే సందర్భంలో టీవీల్లో జనం, అక్కడకు వచ్చే వాళ్లంతా కూడా చూస్తుంటారనే విషయాన్ని గుర్తెరిగి మాట్లాడితే బెటర్ అనే భావనను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు బండ్ల గణేష్ స్పందించాడు. పొరపాటున ఫ్లోలో వచ్చేసింది. క్షమించండని ట్వీట్ పెట్టాడు. తొందరపాటుతో మాట్లాడటం ఎందుకో, ఆ తర్వాత క్షమించమని అడగటం ఎందుకోనని బండ్ల గణేష్ వైఖరిపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.