Sim Card New Rule: 15 రోజుల్లోగా అమలు చేయాల్సిందే.. కంపెనీలకు ఆదేశాలు..!

ABN , First Publish Date - 2022-11-17T16:11:23+05:30 IST

ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు ఎంతలా పెరిగిపోయాయో రోజూ చూస్తూనే ఉన్నాం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనకు తెలీకుండా మన బ్యాంకులోని నగదును ఖాళీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల..

Sim Card New Rule: 15 రోజుల్లోగా అమలు చేయాల్సిందే.. కంపెనీలకు ఆదేశాలు..!

ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు ఎంతలా పెరిగిపోయాయో రోజూ చూస్తూనే ఉన్నాం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనకు తెలీకుండా మన బ్యాంకులోని నగదును ఖాళీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల సిమ్ స్వాప్ మోసాలు పెరిగిపోయాయి. మన నంబర్‌పై మనకు తెలీకుండానే మరో సిమ్‌ను తీసుకోవడం, తద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు DOT( Department of Telecommunications).. కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలను 15 రోజుల్లోగా అమలు చేయాలని అన్ని టెలికాం కంపెనీలకూ ఆదేశాలు జారీ చేసింది.

Viral Video: నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న కొడుకు.. తల్లికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చాడో చూడండి..

సైబర్ మోసాలు రోజు రోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతో ఫిషింగ్ ఈమెయిల్స్ పంపిస్తారు. తద్వారా సదరు వ్యక్తి అసలు పేరు, అడ్రస్ తదితర పూర్తి వివరాలు తెలుసుకుంటారు. తర్వాత సిమ్ పోయిందని చెబుతూ కొత్త సిమ్ కోసం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను కాంటాక్ట్ చేస్తారు. అన్ని వివరాలూ చెప్పి.. ఒకే నంబర్‌పై మరో సిమ్ తీసుకుంటారు. తర్వాత ఆ సిమ్‌ ద్వారా మన బ్యాంకు ఖాతాలోని నగదును కొట్టేస్తారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త నిబందనలను అమల్లోకి తెస్తోంది. కొత్త సిమ్ కోసం అభ్యర్థన లేదా దాని అప్‌గ్రేడ్ చేసినా.. 24గంటల్లోపు కస్టమర్ పాత నంబర్‌కు SMS పంపాలని టెలికాం కంపెనీలను DOT ఆదేశించింది. అలా SMS వచ్చిన సందర్భంలో కస్టమర్‌.. ఆ అభ్యర్థనను తిసర్కరించే అవకాశం ఉంటుంది. తద్వారా సైబర్ నేరాలను అరికట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Viral Video: కడుపులో ఏదో కదులుతోందని ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చివరకు నోటి ద్వారా పరిశీలించి బయటికి తీయగా..

అలాగే మన పేరుతో ఎన్ని సిమ్ నంబర్లు ఉన్నాయనే విషయాన్ని కూడా ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ముందుగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన https://tafcop.dgtelecom.gov.in/ అనే వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, రిక్వెస్ట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను ఎంటర్ చేసి వాలిడేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇలా చేయగానే మన ఆధార్ మీద జారీ అయిన మొబైల్ నంబర్లన్నీ కనిపిస్తాయి. అందులో మనకు అవసరం లేని నంబర్లు ఉంటే రిపోర్ట్ చేయొచ్చు. ఇలా రిపోర్టు చేసిన అనంతరం మన నంబర్‌కు సందేశం వస్తుంది. తద్వారా మనకు సంబంధం లేని నంబర్లను తొలగించుకునే అవకాశం ఉంటుంది.

భర్త కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు.. ఆకలికి తట్టుకోలేక బయటికి వెళ్లిన తల్లీకూతుళ్లు.. అనుకోని విధంగా..

Updated Date - 2022-11-17T16:18:26+05:30 IST