మిస్డ్ కాల్ ద్వారా మొదలైన ప్రేమ.. భర్త వద్దన్నా ప్రియుడిని నేరుగా ఇంటికే పిలుచుకున్న భార్య.. రాత్రి 2గంటల సమయంలో..
ABN , First Publish Date - 2022-12-22T18:01:21+05:30 IST
అపరిచిత వ్యక్తులతో ఏర్పడే స్నేహాల వల్ల కొన్నిసార్లు అపాయం జరుగుతుంటుంది. కొందరు.. తెలియని వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. ఫోన్ ద్వారా మహిళను పరిచయం చేసుకుని.. చివరకు..
అపరిచిత వ్యక్తులతో ఏర్పడే స్నేహాల వల్ల కొన్నిసార్లు అపాయం జరుగుతుంటుంది. కొందరు.. తెలియని వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. ఫోన్ ద్వారా మహిళను పరిచయం చేసుకుని.. చివరకు ప్రాణం పొగొట్టుకున్న ఘటన.. బీహార్లో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు మిస్డ్ కాల్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇది ప్రేమగా మారింది. భర్త వద్దన్నా ప్రియుడిని నేరుగా ఇంటికే పిలుచుకుంది. రాత్రి 2గంటల సమయంలో ఇంట్లోకి రావడంతో చివరకు ఏం జరిగిందంటే..
బీహార్ (Bihar) భాగల్పూర్ కహల్గావ్ పరిధికి చెందిన ఓ మహిళకు కొన్ని నెలల క్రితం కొత్త నంబర్ నుంచి మిస్డ్ కాల్ (Missed call) వచ్చింది. మూడు సార్లు రావడంతో కాసేపటికి తిరిగి కాల్ చేసింది. అటువైపు నుంచి ఓ యువకుడు తనను.. నితీష్గా పరిచయం చేసుకున్నాడు. తనది బంకా జిల్లా అమర్పూర్ అని చెప్పాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుండేవాడు. కొన్నాళ్లు వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. మహిళ తన భర్తకు తెలీకుండా అతడితో మాట్లాడుతూ ఉండేది. కొన్నాళ్లకు ఈ విషయం భర్తకు తెలిసింది.
కారు పక్కన ఫొటోలు దిగుతున్న ఇద్దరు కుర్రాళ్లు.. యజమాని చూసి ఏం చేశాడో అస్సలు ఊహించలేరు..!
దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు (quarrels) మొదలయ్యాయి. అయినా ఆమె మాత్రం అతడితో మాట్లాడుతూనే ఉండేది. బుధవారం ఆమెను కలిసేందుకు మహిళ గ్రామానికి వచ్చాడు. రాత్రి 2గంటల సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్లాడు. అదే సమయంలో అతన్ని గమనించిన స్థానికులు అతన్ని దొంగ అనుకుని.. పట్టుకుని వీధిలోకి లాక్కొచ్చారు. అంతా కలిసి కర్రలతో చితకబాదడంతో (Attack with sticks) అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడి హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.