సినిమా స్టోరీని తలపించిన.. యువతి కిడ్నాప్ డ్రామా.. బర్త్ డే వేడుకలకు వెళ్లి ఆమె చేసిన పని..
ABN , First Publish Date - 2022-12-22T21:37:10+05:30 IST
కొన్నిసార్లు చోటు చేసుకునే కిడ్నాప్ ఘటనల్లో సినిమా స్టోరీలకు మించి ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రేమికుల విషయంలో ఇటీవల ఇలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు..
కొన్నిసార్లు చోటు చేసుకునే కిడ్నాప్ ఘటనల్లో సినిమా స్టోరీలకు మించి ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రేమికుల విషయంలో ఇటీవల ఇలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు యువతీయువకులు.. తల్లిదండ్రులకు భయపడి చిన్న చిన్న సమస్యలకూ కిడ్నాప్ డ్రామాలు ఆడుతుంటారు. తెలంగాణ వనపర్తి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Viral Video: ఇదెక్కడి ఘోరం.. హోటళ్లో కూర్చుని ఉన్నా వదలని మృత్యువు.. ఎలా దూసుకొచ్చిందో చూడండి..
తెలంగాణ (Telangana) వనపర్తి జిల్లా కేంద్రంలో యువతి కిడ్నాప్ డ్రామా సినిమా స్టోరీని తలపించింది. వనపర్తిలోని మహిళా డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఓ యువతి (young woman) బుధవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తమను కిడ్నాప్ చేశారని, వారి నుంచి తాను తప్పించుకున్నానని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. తాను మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద ఉన్నానని తెలపడంతో వెంటనే స్పందించిన జడ్చర్ల పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల సాయంతో ఆ యువతి చెప్పిన వివరాల ఆధారంగా విచారణ చేశారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో యువతిని విచారించగా తాను ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా హైదరాబాద్‌లో బర్త్ డే వేడుకలకు వెళ్లానని, తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో కిడ్నాప్ చేశారని చెప్పినట్లు వివరించింది.
దీంతో జడ్చర్ల పోలీసులు, వనపర్తి పోలీసులకు సమాచారం అందించడంతో పాటూ యువతి తల్లిదండ్రులను పిలిపించి ఆమెను అప్పగించారు. యువతి కిడ్నాప్ డ్రామానే (young woman Kidnapping) అని తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గురువారం యువతిని ఇంటికి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఆమెను మళ్లీ పోలీసు స్టేషన్‌కు తీసుకురాలేదని వనపర్తి పోలీసులు తెలిపారు. ఫిర్యాదు కూడా ఇవ్వనందున కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. మొత్తంగా యువతి ఇంట్లో చెప్పి వెళ్లకుండా వెళ్లడం వల్లే ఈ కిడ్నాప్ డ్రామాను ఆడినట్లు స్పష్టమైంది. కానీ, పోలీసులు మాత్రం రాత్రంతా పరుగులు తీశారు.