SuryakumarYadav: కివీస్ కెప్టెన్ నుంచి సూర్యకి అదిరిపోయే ప్రశంస.. కేన్ మామ ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-11-20T21:21:15+05:30 IST

ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో (t20 world cup2022) అంచనాలకు తగ్గట్టు రాణించిన డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (SuryakumarYadav) న్యూజిలాండ్ టూర్‌లోనూ (NewZealand tour) తన జోరు కొనసాగిస్తున్నారు.

SuryakumarYadav: కివీస్ కెప్టెన్ నుంచి సూర్యకి అదిరిపోయే ప్రశంస.. కేన్ మామ ఏమన్నాడంటే..

స్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో (t20 world cup2022) అంచనాలకు తగ్గట్టు రాణించిన డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (SuryakumarYadav) న్యూజిలాండ్ టూర్‌లోనూ (NewZealand tour) తన జోరు కొనసాగిస్తున్నారు. మౌంట్ మాంగనుయ్ వేదికగా ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ బాది భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో సూర్యపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, వర్తమాన, మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా సూర్యని పొగిడేస్తున్నవారి జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా చేరిపోయాడు.

సూర్య ఆడిన ఇన్నింగ్స్ ప్రపంచానికి అతీతమని, తాను అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటని విలియమ్సన్ ప్రశంసించాడు. కొన్ని షాట్లనైతే ఇదివరకెప్పుడూ చూడలేదని, సూర్య అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడంటూ కితాబిచ్చాడు. సూర్య ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమని, బౌలింగ్‌లో స్వింగ్ విషయంలో ఇండియా బాగా ఆడిందని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిందని, ముఖ్యంగా బౌలింగ్‌లో సమయానుగుణంగా వికెట్లు తీయలేకపోయామని వివరించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యామని ఒప్పుకున్నాడు. మ్యాచ్ అనంతరర ప్రజంటేషన్ సమయంలో ఈ విధంగా స్పందించాడు.

కాగా సూర్య సెంచరీపై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ట్విటర్ వేదికగా ఆసక్తికరంగా స్పందించాడు. ‘‘ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్.. ప్రపంచంలో అతనెందుకు ఉత్తమమో చూపిస్తున్నాడు. నాకైతే లైవ్ చూసినట్టు లేదు. అతడాడిన మరో వీడియో గేమ్‌ ఇది’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ట్విటర్‌లో కేవలం 40 నిమిషాల్లోపే 60 వేలకుపైగా లైక్స్ కొట్టారు. సూర్య అదరగొట్టాడంటూ తెగ పొగిడేస్తున్నారు.

Updated Date - 2022-11-20T21:22:03+05:30 IST

News Hub