IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో ఏ జట్టూ పట్టించుకోని ప్లేయర్లు వీళ్లే.. ఎవరెవరో తెలుసా..

ABN , First Publish Date - 2022-12-23T17:51:57+05:30 IST

ఐపీఎల్ వేలం 2023లో (IPL Auction 2023) పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైన ఆటగాడిగా ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కర్రాన్ చరిత్ర సృష్టించాడు.

IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో ఏ జట్టూ పట్టించుకోని ప్లేయర్లు వీళ్లే.. ఎవరెవరో తెలుసా..

కొచ్చి: ఐపీఎల్ వేలం 2023లో (IPL Auction 2023) పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విలువైన ఆటగాడిగా ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కర్రాన్ చరిత్ర సృష్టించాడు. ఏకంగా రూ.18.50 కోట్ల మొత్తంతో పంజాబ్ కింగ్స్ ఇతగాడిని దక్కించుకుంది. కెమరాన్ గ్రీన్‌ను రూ.17.50 కోట్లతో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక మరో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్ల మొత్తంతో చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ.16 కోట్ల మొత్తంతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. ఒక ఏడాది వేలంలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు రూ.15 కోట్లకుపైగా ధర పలకడం ఇదే మొదటిసారిగా ఉంది. ఇక అత్యధిక ధర పలికిన ఆటగాళ్లను పక్కనపెడితే ఏ ఫ్రాంచైజీలు పట్టించుకోని ప్లేయర్లు కొందరున్నారు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో మీరూ ఓ లుక్కేయండి..

1. ముజీబర్ రెహ్మన్ (బేస్ ప్రైస్ రూ.1 కోటి)

2. తబ్రియాజ్ షంసీ (బేస్ ప్రైస్ రూ.1 కోటి)

3. ఆడమ్ జంపా (బేస్ ప్రైస్ రూ.1.5 కోట్లు).

4. అకీల్ హోసెయిన్ (బేస్ ప్రైస్ రూ.1 కోటి).

5. రీలే రోసో (బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు)

6. జో రూట్ (బేస్ ప్రైస్ రూ.1 కోటి)

7. షేక్ అల్ హసన్ (బేస్ ప్రైస్ రూ.1.5 కోట్లు)

8. లిటన్ దాస్ (బేస్ ప్రైస్ రూ.50 లక్షలు)

9. క్రిస్ జోర్డాన్ (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)

10. ఆమ్ మిల్నే (బేస్ ప్రైస్ రూ.2 కోట్లు)

11. లాన్స్ మోరీస్ (బేస్ ప్రైస్ రూ.30 లక్షలు)

12. ముజ్‌తబా యుసఫ్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

13. కేఎం అసిఫ్ (బేస్ ప్రైస్ రూ.30 లక్షలు)

14. మొహమ్మద్ అజారుద్దీన్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

15. దినేష్ బనా (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

16. సుమీత్ కుమార్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

17. శశాంక్ సింగ్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

18. అభిమన్యు ఈశ్వరన్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

19. సురభ్ కుమార్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

20. ప్రియమ్ గార్గ్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

21. హిమ్మత్ సింగ్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

22. రోహన్ కున్నుమ్మల్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

23. శుభమ్ ఖజురియా (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

24. ఎల్ఆర్ చేతన్ సింగ్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు)

25. అన్మోల్‌ప్రీత్ సింగ్ (బేస్ ప్రైస్ రూ.20 లక్షలు).

Updated Date - 2022-12-23T18:05:50+05:30 IST