Airtel offer: కస్టమర్లకు సూపర్ ఆఫర్ ఇచ్చిన ఎయిర్ టెల్.. రూ.1500 కే డబ్బా టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోండి..!

ABN , First Publish Date - 2022-12-28T15:48:49+05:30 IST

మీ ఇంట్లో ఇంకా పాత టీవీనే వాడుతున్నారా? స్మార్ట్ టీవీ (Smart Tv) కొనాలనుకుంటున్నారా? అయితే అందుకోసం మీరు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్‌టెల్ అందిస్తున్న ఆఫర్‌తో కేవలం రూ.1500తోనే మీ పాత టీవీనీ స్మార్ట్ టీవీగా మార్చుకోవచ్చు.

Airtel offer: కస్టమర్లకు సూపర్ ఆఫర్ ఇచ్చిన ఎయిర్ టెల్.. రూ.1500 కే డబ్బా టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోండి..!

మీ ఇంట్లో ఇంకా పాత టీవీనే వాడుతున్నారా? స్మార్ట్ టీవీ (Smart Tv) కొనాలనుకుంటున్నారా? అయితే అందుకోసం మీరు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్‌టెల్ అందిస్తున్న ఆఫర్‌తో కేవలం రూ.1500తోనే మీ పాత టీవీనీ స్మార్ట్ టీవీగా మార్చుకోవచ్చు. అవును.. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఆఫర్ ద్వారా వినియోగదారులు కేవలం రూ.1500 చెల్లించి స్మార్ట్ టీవీ ఫీచర్లను పొందవచ్చు. Airtel Digital TVకి చెందిన Airtel Xstream Boxను మీ టీవీకి అనుసంధానం చేసుకుంటే మీ టీవీలోనే నేరుగా OTT కంటెంట్‌ను వీక్షించవచ్చు.

Airtel Xstream Box అసలు ధర రూ.2650 కాగా.. ప్రస్తుతం దానిని కేవలం రూ.1500కే పొందవచ్చు. దీని ద్వారా Amazon Prime, Sony Live, Eros Nowతో సహా 15 OTT ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను చూడవచ్చు.

Airtel Xstream Box ద్వారా 500+ టీవీ ఛానెళ్లు, 500+యాప్‌లు, Android Tv వెర్షన్ 9‌ను పొందవచ్చు. అంతకాదు 4K రిజల్యూషన్‌లో వీడియోలను చూడవచ్చు. ఈ కొత్త Xstream Box‌ను ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ నుంచి గాని, లేదా ఎయిర్‌టెల్ రిటైల్ షోరూం నుంచి గానీ పొందవచ్చు.

Updated Date - 2022-12-28T15:48:51+05:30 IST