ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ బీఎన్ రావు
ABN , First Publish Date - 2022-10-04T09:56:13+05:30 IST
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లికి చెందిన డాక్టర్ బండారి నరేందర్ రావు ఎన్నికయ్యారు.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లికి చెందిన డాక్టర్ బండారి నరేందర్ రావు ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో 80ఐఎంఏ బ్రాంచ్‌లకు చెందిన 410 మంది వైద్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది అధ్యక్షుడిగా బీఎన్‌రావు, 2023-24 సంవత్సరానికి ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా వరంగల్‌కు చెందిన డాక్టర్ కాలీ ప్రసాద్‌రావు, ఆ మరుసటి ఏడాదికి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి ఎన్నికైనట్లు ఐఎంఏ వర్గాలు వెల్లడించాయి.