‘సదర్’ స్పెషల్
ABN , First Publish Date - 2022-10-23T12:27:38+05:30 IST
నగరంలో ఈనెల 27న జరిగే సదర్ ఉత్సవాలలో హరియాణా రాష్ట్రానికి చెందిన శ్రీకృష్ణ, తలసాని అర్జున్‌యాదవ్
శ్రీకృష్ణ, గరుడ దున్నరాజు
1800 కిలోల బరువు, ఏడు ఫీట్ల ఎత్తు,
రోజు ఖర్చు రూ. 5 వేలు నుంచి 10వేలు
హైదరాబాద్/ముషీరాబాద్/ఖైరతాబాద్: నగరంలో ఈనెల 27న జరిగే సదర్ ఉత్సవాలలో హరియాణా రాష్ట్రానికి చెందిన శ్రీకృష్ణ, తలసాని అర్జున్‌యాదవ్, షేర్‌ఖాన్, చాంపియన్ బుల్, గరుడ, కట్టప్ప దున్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఐదేళ్ల వయసు, గంభీరమైన ఆకారం, ఆయా దున్నలు 1600 నుంచి 1800 కిలోల బరువు, ఆరున్నర నుంచి ఏడు అడుగుల ఎత్తు, 15- 18 అడుగుల పొడవుతో ఆకర్షిస్తున్నాయి. ముర్రజాతికి చెందిన దున్నల్లో కొన్నింటి ఆహార ఖర్చు రోజూ రూ.5వేల నుంచి 10 వేల వరకు ఉంటుంది. ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబుయాదవ్, ఖైరతాబాద్‌కు చెందిన దూద్‌వాలా నిర్వాహకుడు లక్ష్మణ్ యాదవ్, మధు యాదవ్‌లు ఈ దున్నలను ప్రత్యేకంగా నగరానికి తెప్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు చెందిన తలసాని అర్జున్‌యాదవ్ దున్న కూడా విన్యాసాలు చేయనుంది.