Betting App Case: బెట్టింగ్ కేసు.. నేడు మరోసారి పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:31 AM
బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పలువురు సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ విష్ణుప్రియ నేడు మరోసారి విచారణకు హాజరుకానుంది.

హైదరాబాద్: బెట్టింగ్ భూతం.. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తుంది.. ఎందరినో బలి తీసుకుంటుంది. బెట్టింగ్ యాప్‌లకు బానిసలుగా మారి.. అప్పుల పాలై.. చివరకు వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈజీ మనీకి అలవాటు పడి.. బెట్టింగ్ యాప్‌లు చేసే మాయలో చిక్కుకుని సర్వం పోగొట్టుకుని ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు పెరగడంతో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ పై ఉక్కుపాదం మొపారు. దీనిలో భాగంగానే.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.
దీనిలో భాగంగా యాంకర్ విష్ణుప్రియ మీద కూడ కేసు నమోదయ్యింది. ఇప్పటికే ఒకసారి పోలీసులు విచారణకు హాజరైన విష్ణుప్రియ.. నేడు మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు హాజరుకానుంది. మొదటి సారి విచారణకు హాజరయిన విష్ణు ప్రియాను సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. అనంతరం ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసి మొబైల్‌ను కూడా సీజ్ చేశారు.
ఆ తర్వాత మరోసారి విచారణకు రావలసిందిగా పోలీసులు విష్ణుప్రియకు నోటీసులు అందించారు. దాంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన హైకోర్టు విష్ణుప్రియ వేసిన క్వాపిటిషన్‌ను కొట్టేసింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలంటూ.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో నేడు (శనివారం) నాడు విష్ణుప్రియ మరోసారి పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు హాజరుకానుంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, ఆర్ధిక లావాదేవీలపై పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియను నేడు మరోసారి ప్రశ్నించనున్నారు. అలాగే రానున్న రోజుల్లో మరికొందరని సెలబ్రిటీలను విచారించి మరింత సమాచారం సేకరించనున్నారు. ఇక ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని ఇప్పటికే పోలుసులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
మీరు బయట జ్యూస్ తాగుతున్నారా.. అయితే ఒక్కసారి..
ఆ నీటిని వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు రావడం ఖాయం.