ఏక్ దినకా ఎస్‌ఐ!
ABN , First Publish Date - 2023-12-09T00:38:46+05:30 IST
కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటేనే అధికార యంత్రాంగం హడలెత్తుతోంది. ఇక్కడ పనిచేయాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ సబ్‌రిజిసా్ట్రర్ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది.

అధికార పార్టీ దెబ్బకు పరుగో.. పరుగు
కంబదూరు స్టేషనంటే భయం.. భయం
అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారుల్లో విముఖత
పెరిగిపోతున్న అసాంఘిక కార్యకలాపాలు
కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటేనే అధికార యంత్రాంగం హడలెత్తుతోంది. ఇక్కడ పనిచేయాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ సబ్‌రిజిసా్ట్రర్ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఇద్దరు ముగ్గురు బదిలీలపై వచ్చి వెళ్లిన తర్వాత తాజాగా వారం రోజులక్రితం వచ్చిన వెంకటనాయుడు ఒకే ఒక్కరోజు పనిచేసి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. కంబదూరు పోలీ్‌సస్టేషన పరిస్థితి కూడా అందుకు డిటోగా తయారైంది. ఇక్కడ ఎస్‌ఐగా పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తాజాగా విజయకుమార్ రాజు అనే అతడిని ఎస్‌ఐగా నియమించారు. ఆయన కూడా ఒకే ఒక్కరోజు పనిచేసి ఇక్కడనుంచి పరుగు లంకించుకున్నాడు. ఇలా అధికారులు ఇక్కడ పనిచేయకుండా భయపడడానికి ఇక్కడ అధికారంలో ఉన్న ఓ మహిళాశక్తే కారణమని జనం చెప్పుకుంటున్నారు.
కంబదూరు, డిసెంబరు 8: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే అతి పెద్ద మండలంగా పేరుపొందిన కంబదూరు పోలీ్‌సస్టేషనకు ఎస్‌ఐగా వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసించలేకపోతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, క్రైం రేట్ ఎక్కువగా ఉండడంతో ఇక్కడకు రావాలంటే అందరూ వెనకడుగు వేస్తున్నారు. దీంతో మండలంలో అసాంఘిక కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఈ స్టేషనలో పనిచేయడానికి నవంబరు 7న వీఆర్ నుంచి ఓ ఎస్‌ఐని నియమించారు. ఆయన కేవలం ఒక్కరోజు మాత్రమే బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత రోజు నుంచి సెలవులో వెళ్లిపోయారు. ఇందుకు కారణం అధికార పార్టీ ఒత్తిడా? లేక ఇక్కడున్న క్రైం రేటా? అన్నది అంతుబట్టడంలేదు. కేవలం విధుల్లో చేరిన మరుసటి రోజు నుంచి సెలవులో వెళ్లిపోవడంతో, ఇక్కడికి ఎస్‌ఐగా వచ్చేవారే కరువయ్యారు. దీంతో కంబదూరు ఇనచార్జి ఎస్‌ఐగా కళ్యాణదుర్గం రూరల్ ఎస్‌ఐకు బాధ్యతలు అప్పగించారు. చివరగా ఇక్కడ పనిచేసిన ఎస్‌ఐ రాజేష్ సుమారు ఏడాదిన్నర పాటు పనిచేశారు. ఆయన కూడా ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, క్రైం రేట్ పనిభారంతో పనిచేయగలిగాడు. ఆయన ఏడాదిన్నర పాటు విధులు నిర్వహించి, ఒత్తిడితో సతమతం అయ్యారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఆయన వెళ్లిన తర్వాత ఇక్కడ పనిచేసేందుకు ఏ ఒక్కరూ ఇష్టపడడంలేదని తెలుస్తోంది. ఇక్కడ రెగ్యులర్ ఎస్‌ఐ లేకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆట...పాడిందే పాటగా సాగుతోంది.
తాజాగా కంబదూరు మండలం రాంపురం గ్రామానికి చెందిన మహేష్ అనే రైతు తన తోటలో వ్యవసాయ పరికరాలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదుచేశాడు. దాంతో పాటు దొంగల వివరాలు కూడా చెప్పాడు. అయినా కంబదూరు పోలీ్‌సస్టేషనలో తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారని బాధిత రైతు విమర్శిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతోంది. కర్నాటక సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ స్టేషన ఉంది. కర్నాటక సరిహద్దు మండలం కావడంతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. కంబదూరు మండలం కూరాకులపల్లిలో ప్రతిరోజు లక్షలాది రూపాయల వరకు జూదం జరుగుతున్నట్లు అక్కడున్న గ్రామస్తులే చెబుతున్నారు. కర్నాటక, ఆంధ్రకు మధ్యలో కురాకులపల్లి ఉండడంతో ఇక్కడ గత కొన్ని నెలల నుంచి విచ్చలవిడిగా జూదం (పేకాట, బిళ్లాట) జరుగుతోంది. ఇక దొంగతనాలకు అంతేలేదు. కర్నాటక మద్యం ఏరులై పారుతోంది. పట్టపగలే అక్రమంగా గ్రానైట్, రేషన బియ్యం పోలీ్‌సస్టేషన ముందే కర్నాటకకు యథేచ్చగా తరలిపోతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలోనే క్రైంరేట్‌లో కంబదూరు మండలం పేరు పొందింది. హత్యలు, కిడ్నా్‌పలు, సంచలనాలకు మారుపేరుగా రికార్డులకెక్కింది. దాంతో పాటు ఇద్దరు ఎస్‌ఐలు కూడా వివాదాల్లో ఇరుక్కుని సస్పెండ్ అయ్యారు. అంతేకాకుండా జనం తిరగబడి ఎస్‌ఐలను నిర్భంధించే స్థాయికి ఎదిగారు. తాజాగా రాజకీయ శక్తుల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఇక్కడకు వచ్చే సాహసి ఎవరా? అని జనం ఎదురుచూస్తున్నారు.