Share News

అర్ధరాత్రి వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు

ABN , First Publish Date - 2023-12-02T23:58:55+05:30 IST

దొంగలు తిరిగే సమయంలో వైసీపీవారు చంద్రబాబు కొట్టాల వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ సీపీఐ నగరకార్యదర్శి ఎద్దేవా చేశారు.

అర్ధరాత్రి వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు

విగ్రహాన్ని తొలగించాలని సీపీఐ, టీడీపీ, జనసేన నాయకుల ధర్నా

అనంతపురంరూరల్‌, డిసెంబరు 2: దొంగలు తిరిగే సమయంలో వైసీపీవారు చంద్రబాబు కొట్టాల వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ సీపీఐ నగరకార్యదర్శి ఎద్దేవా చేశారు. సీపీఐ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విగ్రహాన్ని తొలగించాలని చంద్రబాబు కొట్టాలకు వెళ్లే కూడలిలో ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జి గోపాల్‌గౌడ్‌, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శి నాగేంద్రకుమార్‌, కాంగ్రె్‌సపార్టీ నగర అధ్యక్షుడు శర్మ్‌సవలి హాజరై మాట్లాడారు. అర్ధరాతి వైఎస్సార్‌ ఆత్మఘోషించేలా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సిగ్గు చేటన్నారు. శుక్రవారం కూడా సీపీఐ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకించిందన్నారు. అనుమతుల తీసుకోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. కలెక్టరేట్‌ ఎదుట ఫెర్రర్‌ విగ్రహం తొలగిస్తే ప్రజాసంఘాలు, అఖిలపక్ష పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తే ఆయన విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎక్కడా చూడలేదన్నారు. అక్రమంగా పెట్టిన విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ను కలుస్తామన్నారు. అల్లీపీరా, రమణయ్య, బాలప్ప, వడ్డే మురళి, నాగభూషణం, వెంకటరాముడు, కుమారనాయుడు, ఖుషిదా, మునాఫ్‌, బాలయ్య. రామయ్య, ధనుంజయ, కిరణ్‌కుమార్‌, రాజ్‌, భాష, అంజి, సంపత, అశోక్‌, అనూష, సరిత, వంశీ పాల్గొన్నారు.

Updated Date - 2023-12-02T23:58:57+05:30 IST