Share News

SPORTS : ఏపీ సూపర్‌కప్‌ విజేత గోదావరి

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:06 AM

ఏపీ సూపర్‌ కప్‌ - 2025 ఫుట్‌బాల్‌ పోటీల విజేతగా గోదావరి క్లబ్‌ జట్టు నిలిచింది. నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో గురువారం ఫైనల్స్‌ నిర్వహించారు. లీగ్‌ పోటీల్లో ముందంజలో ఉన్న కొల్లేరు 18 పాయింట్లు, గోదావరి 15 పాయింట్లు సాధించి ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఎక్కడా ఓటమి లేకుండా ఫైనల్స్‌కు చేరిన కొల్లేరు జట్టుపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా పుంజుకున్న గోదావరి జట్టులో దిలీప్‌, అక్షయ్‌ చెరో గోల్‌ చేశారు.

SPORTS : ఏపీ సూపర్‌కప్‌ విజేత గోదావరి
AP Football Association President Kotagiri Sridhar speaking

- రన్నరప్‌గా నిలిచిన కొల్లేరు జట్టు

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఏపీ సూపర్‌ కప్‌ - 2025 ఫుట్‌బాల్‌ పోటీల విజేతగా గోదావరి క్లబ్‌ జట్టు నిలిచింది. నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో గురువారం ఫైనల్స్‌ నిర్వహించారు. లీగ్‌ పోటీల్లో ముందంజలో ఉన్న కొల్లేరు 18 పాయింట్లు, గోదావరి 15 పాయింట్లు సాధించి ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఎక్కడా ఓటమి లేకుండా ఫైనల్స్‌కు చేరిన కొల్లేరు జట్టుపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా పుంజుకున్న గోదావరి జట్టులో దిలీప్‌, అక్షయ్‌ చెరో గోల్‌ చేశారు. కొల్లేరు జట్టులో సూర్య మాత్రమే గోల్‌ కొట్టాడు. దీంతో గోదావరి జట్టు ఒక గోల్‌ తేడాతో విజయం సాధించి ఏపీ సూపర్‌ కప్‌ -2025 మొదటి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఏపీ పుట్‌బాల్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్‌ చేతుల మీదుగా విజేత జట్టుకు కప్‌తో పాటు రూ.5లక్షల నగదు బహుమతి అందజేశారు. రన్నరప్‌తో సరి పెట్టుకున్న కొల్లేరు జట్టుకు కప్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ... కరవుసీమగా పేరొందిన అనంతపురం జిల్లాలోని క్రీడలు, క్రీడాకారులకు ఆర్డీటీ గొప్పవరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పుట్‌బాల్‌కు ఉన్న ఆదరణను జిల్లా, రాష్ట్రంలోని అందరికీ చేరువచేయాలనే లక్ష్యంతోనే ఏపీ సూపర్‌కప్‌ పుట్‌బాల్‌ లీగ్‌ పో టీలను తీసుకొచ్చామని తెలిపారు. వచ్చే ఏడాది రెండో ఏపీ సూపర్‌కప్‌ విజేతకు రూ. 25లక్షలు నగదు బహుమతి చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన రాష్ట్ర టెక్నికల్‌ డైరెక్టర్‌ సుధాకర్‌, ఉపాధ్యక్షుడు సరిపూటి వేణుగోపాల్‌, మస్టర్‌ సీఈఓ గాయత్రి, ఫుట్‌బాల్‌ అసోసియేషన జిల్లా కార్యదర్శి మల్లేష్‌, ప్రతినిధులు చిన్నబాబు, చక్రవర్తి, రాజేష్‌, శేషగిరిరావు, నీలాద్రి, రెడ్డప్ప, నాగరాజు, అనిల్‌, సుబ్రహ్మ ణ్యం, సిరాజుద్దీన, పవన, కోచలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 28 , 2025 | 01:06 AM